ఘనంగా ప్రారంభమైన దుర్గాదేవి శరన్నవరాత్రులు వాడవాడల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారు
కొత్తవలస, మేజర్ న్యూస్ : మండలంలోని పలు ప్రాంతాల్లో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల సందర్భంగా వాడవాడలా అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ రోడ్డులో గల దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వెలవల శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించరు. అలాగే దుర్గాదేవి లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ ఆధ్వర్యంలో విజయనగరం రహదారిలో అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొత్తవలస గ్రామంలో బోని ఎర్రయ్య భవానీ దంపతులు ఆధ్వర్యంలో కాలనీలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించేందుకు అయ్యప్ప స్వామి సేవ పీఠం సభ్యులు వెళ్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు అదేవిధంగా దేశపాత్రునిపాలెం గ్రామంలో బెస్ట్ ఫ్రెండ్స్ కమిటీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారుఈ సందర్భంగా గ్రామంలో సుమారు 100 మంది పైగా భవాని మాలాధారణ చేశారు దీంతో ఆ గ్రామంలో పండగ వాతావరణం ఏర్పడింది. పలు ఆలయాలు, మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలతో ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ, తమ కోర్కెలు నెరవేరాలని భక్తులు ప్రార్థిస్తున్నారు.