దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ
సూర్య బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టాపించిన శ్రీ దుర్గాదేవి మాత విగ్రహానికి రుద్రంగి ప్రకాష్ గుప్తా వారి కుమారులు వెండి త్రిశూలాన్ని ఆదివారం బహుకరించారు. ఆర్యవైశ్య సంఘం మహిళలు అధిక సంఖ్యలో చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమభిషేకలు నిర్వహించారు. కార్యక్రమంలో నార్ల రత్నకుమార్ గుప్త నార్ల రాఘవేందర్ గుప్తా చిదుర రమేష్ గుప్తా నాగులగామ వెంకన్న గుప్తా సిర్నాదత్తయ్య గుప్తా నార్ల ఉదయ గుప్తా తూప్తి నాగరాజు గుప్తా ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.