బొంకుల దిబ్బ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రులు
పరవాడ గ్రామంలో బొంకులదిబ్బ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రులు మహోత్సవ సందర్భంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం వై.సి.పి రాష్ట్ర కార్యదర్శి , మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు పైల శ్రీనివాసరావు, పరవాడ మండల మాజీ ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ దంపతులు చేతులు మీదుగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ దేవి నవరాత్రులు మహోత్సవ సందర్భంగా దుర్గ మాత ఆశిశులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు., దానిలో భాగంగా బొంకులదిబ్బ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోస్టర్ ఆవిష్కరణ, దుర్గ దేవి లక్కీ డ్రా బుక్ ల ను రాష్ట్ర కార్యదర్శి పైల శ్రీనివాసరావు , రాష్ట్ర ఎస్ ఇ సి మెంబెర్ పైల సన్యాసిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండల పార్టీ అధ్యక్షులు కోన రామారావు, మాజీ వార్డు మెంబెర్ పైల అప్పలనాయుడు సత్యవేణి, యూత్ సభ్యులు చీపురుపల్లి శ్రీనివాసరావు, గండి మహేష్, బోండా శంకర్, పైల పైడం నాయుడు, లాలం ముత్యాల నాయుడు, గండి ముకేశ్, గండి కిరణ్, రొంగలి అయ్యబాబు, వర్రీ నుకేంద్ర, పైల అప్పారావు, రెడ్డి గణేష్, రొంగలి చరణ్, పైల ప్రసాద్, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
రవి కుమార్
సూర్య ప్రతినిధి