BREAKING
రాష్ట్రస్థాయి ఆర్చరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చర్ల "జయభేరి" – నేషనల్స్‌కు అర్హత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. క్రీడల్లో రాణించాలి: ఎస్పీ నితికా పంత్ ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం

యువత నడుం కడితే అన్ని వ్యవస్థల్లో మార్పు తథ్యం

Select Suryaa Now
యువత నడుం కడితే అన్ని వ్యవస్థల్లో మార్పు తథ్యం


సూర్య, హుజురాబాద్:యువత దేశానికి పట్టుకొమ్మలని, వారు సమాజ మార్పుకు నడుం కడితే అన్ని వ్యవస్థల్లో మార్పు తద్యమని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో పౌర హక్కుల నాయకుడు బాలగోపాల్ 17వ సంస్మరణ సభ జరిగింది. ఈ సభలో నాగయ్య మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో సమాజంలో మార్పు కోసం యువత ముందుకు రావడంతో అన్ని వర్గాలు వారి వెనుక వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు. బాలగోపాల్ దేశంలోని పౌరుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన పోరాటయోధుడు అని అన్నారు. చత్తీస్గడ్ లోని భీరం ఘాటి ఆదివాసీల కు విధించిన మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ప్రజల ఆకాంక్షకు ప్రభుత్వాలు వ్యతిరేకంగా వ్యవహరిస్తే బాలగోపాల్ బడుగు బలహీన వర్గాల, హక్కులు కోల్పోయిన వారికి  మద్దతుగా నిలిచి పోరాటం చేశాడని అన్నారు. ప్రస్తుత తెలంగాణలో పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతుందని బాలగోపాల్ అడుగుజాడల్లో నేటి తరం ముందుకు నడిచి హక్కుల సాధనకు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు రావాలన్నారు. నిద్రాణంలో ఉన్న ప్రజలను బాలగోపాల్ మేల్కొల్పేవాడని, నైతిక శక్తి రాజకీయాలను మార్పు చేస్తుందన్నారు. బాలగోపాల్ పోరాట పటిమను, ఆశయాల సాధన ను ముందుకు తీసుకొని వెళ్లి అభాగ్యులకు న్యాయం కలిగే విధంగా చేయాలన్నారు. ఈ సభలో మానవ హక్కుల వేదిక ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తిరుపతయ్య,
జేఏసీ అధ్యక్షులు ఆవునూరి సమ్మయ్య, టీజేఎస్ రాష్ట్ర నాయకులు, న్యాయవాది ముక్కెర రాజు, భారత నాస్తిక సమాజం జాతీయ అధ్యక్షుడు జీడి సారయ్య, డిటిఎఫ్ రాష్ట్ర నాయకురాలు రమాదేవి, భారత్ బచావో నాయకులు భీమోజు సదానందం, పొడి శెట్టి వెంకట్రాజం, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, టీఎస్ సింగ్, ఇమ్మడి సంపత్ కుమార్ ,పాక సతీష్, వేల్పుల ప్రభాకర్, గుంటి సామ్రాజ్యం, గాయకులు శనిగరం బాబ్జి, రామంచ భరత్ , మార్త రవీందర్ తదితరులు పాల్గొన్నారు