పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
--పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ ఇంచార్జీల నియామకం
-జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్ ):కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఒకప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా జిల్లా లోని నియోజక వర్గాల వారీగా ఇన్చార్జిలను
నియమించనైనదని
ఖమ్మం నియోజక వర్గ ఇంచార్జి గా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మధిర నియోజకవర్గ ఇంచార్జిగా శాసనమండలి మాజీ సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, వైరా నియోజకవర్గ ఇంచార్జిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి,సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జిగా శాసనమండలి మాజీ సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ లను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలిపారు.
ఇంచార్జిలు అందరు తక్షణమే నియోజకవర్గం లోని మండలాలలో మండలంను యూనిట్ తీసుకొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.