ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయండి.
సోమవారం ఉదయం 11 గంటలకు కొందుర్గ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ముఖ్యమంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ ను విజయ వంతం చేయాలని కొందుర్గ్ మండల వ్యవసాయ అధికారి రాజేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, యాసంగి సీజన్లో రైతులతో ముఖాముఖి, సమీక్ష సమావేశం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని, ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షoగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కొందుర్గు మండలంలోని కొందుర్గు రైతు వేదిక, తంగేలపల్లి రైతు వేదిక,
ముట్పూర్ రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము చైర్మన్ ,వైస్ చైర్మన్ ,డైరెక్టర్స్,అన్ని గ్రామాల సర్పంచులు ,ఉప సర్పంచులు ,వార్డు సభ్యులు, మండల స్థాయి , గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు,
ఎరువులు, పురుగుమందుల మరియు విత్తన డీలర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతు లు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు హాజరు కావాలని కోరారు.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్, కొందుర్గ్.