మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం
మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎత్బార్ పల్లి గ్రామానికి చెందిన ఎం. దాసు నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ విభాగం రంగారెడ్డి జిల్లా చైర్మన్ క్యారగారి శ్రీధర్ అక్టోబర్ 11, 2026న నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామేనా భీమ్ భరత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా క్యారగారి శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దాసుకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొలిగిద్ద సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు తమ్మలి మానయ్య, మాజీ మండల ఉపాధ్యక్షుడు మర్రి రవీందర్ రెడ్డి, గన్నెపాగ నరసింహారావు, బాలకృష్ణారెడ్డి, కొండకళ్ల చంద్రశేఖర్, మానుక మధుసూదన్‌తో పాటు ఎత్బార్ పల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎం. దాసు మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన దాసుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
(మొయినాబాద్, మేజర్ న్యూస్)