BREAKING
మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.… ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం : జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా కళ్యాణదుర్గం గ్రంథాలయంలో గ్రూప్ -1,గ్రూప్ -2 పుస్తకాల ఆవిష్కరణ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి బొంకుల దిబ్బ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రులు యువత నడుం కడితే అన్ని వ్యవస్థల్లో మార్పు తథ్యం

వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి!

Select Suryaa Now
వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి!

*- ఆర్థిక నేరాల కేసుల నుంచి తప్పించుకునేందుకు కాలయాపన 

*- ఈడీ విచారణకు రాజకీయ రంగు పులమడం సరికాదు*

*- కేసుల విచారణ వేగవంతం చేసి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి*

*- మంత్రి కొల్లు రవీంద్ర*

 సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

వాస్తవాలను పక్కదారి పట్టించి, వాటిని రాజకీయంగా వాడుకోవడమే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ నీతి అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ రాజకీయ వైఖరి, ఆయనపై ఉన్న కేసులు, దర్యాప్తు సంస్థల విచారణ, కోర్టు వ్యవహారాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వాస్తవాలను పక్కదారి పట్టించి రాజకీయంగా లబ్ధి పొందడమే జగన్‌ విధానమని, తనపై ఉన్న కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎదుటివారిపై నిందలు వేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. గుడ్డ కాల్చి ఎదుటివారి మీద వేయడం, తనకు సంబంధించిన కేసుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేయడం జగన్‌ రాజకీయ పద్ధతిగా మారిందని విమర్శించారు. దాదాపు పదిహేను సంవత్సరాలుగా తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సుమారు రూ.48 వేల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై 2011లో సీబీఐ విచారణ జరిపి కేసులు నమోదు చేసిందని, అప్పట్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఆ కేసుల్లో మనీ లాండరింగ్‌ జరిగిందని, కంపెనీల వాటాల విలువలను పెంచి, షెల్‌ కంపెనీలను సృష్టించి, వాటి ద్వారా వచ్చిన డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నారనేది ప్రధాన ఆరోపణ అని వివరించారు.

*వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకున్నారు :*

తన సొంత బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులోనూ జగన్‌ రాజకీయ నాటకాలు ఆడారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. హత్యను చంద్రబాబు నాయుడుకు ఆపాదించేలా అప్పట్లో ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ సాక్షి పత్రికలో కథనాలు ప్రచురించారని, చంద్రబాబు చేతిలో గొడ్డలి ఉన్నట్లుగా చూపిస్తూ రాజకీయ ప్రచారం చేశారని విమర్శించారు. వివేకానందరెడ్డి కుమార్తె, తన చెల్లెలు న్యాయపోరాటం చేసి సీబీఐ విచారణకు పట్టుబట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, ఆ పరిణామాలు తాడేపల్లి ప్యాలెస్‌ వైపు వేళ్లు చూపించాయన్నారు. ఇది వాస్తవం కాదా అని జగన్‌ను ప్రశ్నించారు. ఈడీ విచారణను వేగవంతం చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్‌ డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కోర్టులో నాలుగు వేలకు పైగా డిశ్చార్జ్‌ పిటిషన్లు వేసి, విచారణకు సంబంధించిన వాయిదాలకు హాజరుకాకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విచారణను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటే దానికి కూడా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

*అసత్యల ‘సాక్షి’ :*

అవినీతి సొమ్ముతో ఏర్పాటైన పత్రికగా అభివర్ణిస్తూ, పేరులో సాక్షి ఉన్నప్పటికీ అది అసత్యాలకు సాక్షిగా మారిందని వ్యాఖ్యానించారు. పది రూపాయల విలువైన షేరుకు రూ.350కు పైగా విలువ కట్టించి, షెల్‌ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టించి, ఆర్థిక లావాదేవీలను మళ్లించుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారాల నుంచి ఎవరూ తప్పించుకోలేరని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేంద్ర ఆర్థిక శాఖకు సంబంధించిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని, రాష్ట్ర ప్రభుత్వానికి దాని విచారణతో సంబంధం లేదని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఈడీ విచారణను వేగవంతం చేయాలని తెలంగాణ హైకోర్టులో చర్యలు సాగుతున్న నేపథ్యంలో, దానికి రాజకీయ రంగు పులిమేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ రెడ్డి క్రిమినల్ మైండ్‌ను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీబీఐ కేసులు కోర్టులో ఉన్నంత మాత్రాన ఈడీ విచారణ చేయకూడదని చట్టంలో ఎక్కడా లేదని మంత్రి పేర్కొన్నారు. రెండు సంస్థల విచారణలు వేర్వేరని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. విచారణ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా సాధ్యం కాదని జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, దానిపై ఎవరి ప్రభావం ఉండదని అన్నారు. అలాంటి సంస్థ చేపట్టే విచారణను రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరిస్తూ సాక్షి పత్రికలో కార్టూన్లు, శీర్షికలు ప్రచురించడం ద్వారా ప్రజల్లో అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విచారణ నుంచి తప్పించుకోవచ్చనే ఉద్దేశంతోనే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.

*ఆర్థిక నేరాలపై విచారణ వేగవంతం కావాలి :*

ఆర్థిక నేరాలు సమాజానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్‌ వంటివని సుప్రీంకోర్టు చెప్పిందని కొల్లు రవీంద్ర గుర్తుచేశారు. ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక పరిస్థితులపై, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. డబ్బు ఉందనే కారణంతో అక్రమాలకు పాల్పడటం, కేసుల విచారణ జరగకుండా డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తూ కాలయాపన చేయడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. డబ్బుంటే కేసులను మాఫీ చేసుకోవచ్చా? డబ్బుంటే కేసులను సుదీర్ఘకాలం సాగదీయవచ్చా? అని ప్రశ్నించారు. కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా విచారణను ఆలస్యం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత హాజరు విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కోర్టులకు ఉందని మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా హాజరు కావాలా వద్దా అనే అంశం చట్టపరమైన వ్యవహారమని, దాని నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ వేస్తే దానిపై నిర్ణయం తీసుకునేది హైకోర్టేనని అన్నారు. దీనికి ప్రభుత్వానికి ఏమి సంబంధమని ప్రశ్నించారు. ప్రతి అంశానికి సంబంధాలు కల్పిస్తూ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఉన్నామని చెప్పి విచారణల నుంచి తప్పించుకోవచ్చా? ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే కోర్టులకు హాజరుకావాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లు ఉన్న సమయంలోనూ విచారణలకు హాజరుకాకుండా వ్యవహరించారని, ఇప్పుడు కూడా డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తూ వాయిదాలను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు.

*తండ్రిని కూడా కేసుల్లో ఇరికించారు :*

తన స్వార్థ ప్రయోజనాల కోసం తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని సైతం కేసుల్లో ఏ5గా చేర్చే పరిస్థితి తీసుకొచ్చారని కొల్లు రవీంద్ర విమర్శించారు. కొడుకుగా తండ్రికి గౌరవం పెంచాల్సిన వ్యక్తి, తనపై ఉన్న ఆర్థిక నేరాల ఆరోపణల నేపథ్యంలో తండ్రి పాత్ర కూడా ఉందనే ఆరోపణలు ఎదురయ్యే పరిస్థితిని కల్పించారని అన్నారు. ఈ పరిణామాలు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. తండ్రి మరణించినప్పుడు ఆయన భౌతికకాయం పక్కనే కూర్చుని సంతకాలు సేకరించి జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డాడని ఎద్దేవా చేశారు. తండ్రి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన వ్యవహారాలకు సంబంధించి తండ్రి పేరును సైతం కేసుల్లోకి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కన్నతండ్రికి విలువలు పెంచాల్సిన కొడుకు, ఆయన్నే కేసుల్లో ఇరికించే పరిస్థితికి కారణమయ్యారని అన్నారు. జగన్‌ రాజకీయ సంస్కృతి, నేర చరిత్రపై ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా రెచ్చగొట్టే కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాదాపు పదకొండు కేసులు ఉన్నాయని, విచారణలకు హాజరుకాకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. పదహారు నెలలపాటు జైలు జీవితం గడిపినా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఇంకా నేరపూరిత ఆలోచనలతో యువతను తప్పుదోవ పట్టిస్తూ రాష్ట్రంలో వారిని సర్వనాశనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘రప్పా రప్పా’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని, విచారణను తాత్కాలికంగా ఆలస్యం చేయాలని ప్రయత్నించినా కోర్టులు ఈ అంశాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

*దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేయడం సరికాదు :*

దర్యాప్తు సంస్థలపై ఆరోపణలు చేయడం రాజకీయ ఉన్మాదానికి నిదర్శనమని కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ కేసులకు సంబంధించి ప్రస్తావనలు చేసిందని పేర్కొన్నారు. జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ సందర్భంగా ఈ కేసులో ఆర్థిక నేరాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయని అన్నారు. తన ఆర్థిక వ్యవహారాల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయనే విషయాలు సుప్రీంకోర్టులోనూ పలుసార్లు ప్రస్తావనకు రావడం అవమానకరమని వ్యాఖ్యానించారు. అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ సాక్షి పత్రికలో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని కోర్టులు కూడా తీవ్రంగా పరిగణించాలన్నారు. పదిహేను సంవత్సరాలుగా కేసుల విచారణకు హాజరుకాకుండా తప్పించుకునే పరిస్థితులు కొనసాగితే న్యాయస్థానాలపై సామాన్యులకు నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కేసుల విచారణను అత్యంత వేగంగా పూర్తి చేసి, వాటిలోని వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

*తప్పు చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు :*

కేసుల్లోని ఆరోపణలు నిరూపితమైతే వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే తప్పుడు కథనాలు ప్రచురిస్తూ కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర దర్యాప్తు సంస్థలపై, రాష్ట్రాలపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రజలందరూ గమనించాలని కోరారు. నేరాలకు పాల్పడినవారు ఎప్పటికీ చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. విచారణలో కొంత ఆలస్యం కావచ్చేమో కానీ తప్పు చేసినవారు కచ్చితంగా శిక్షించబడతారని పేర్కొన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌మోహన్‌రెడ్డి చట్టం నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.