కులవృత్తులకు అండగా బీజేపీ
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో చర్మకారులను బీజేపీ నాయకులు శాలువాలతో సన్మానించి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చర్మకారుల జీవన విధానాన్ని అడిగి తెలుసుకొని, త్వరలో పీఎం విశ్వకర్మ యోజన ద్వారా పనిముట్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వాల్మీకి దయాసాగర్, లలిత్ కుమార్ జైన్, రాజశేఖర్ స్వామి, కురువ బడేసాబ్, వడ్డే ఊరుకుందు, కమ్మరి పద్మావతి, రవికిరణ్, తిరుమల, చక్ర నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.