telanagana
నేటి నుండి ఎన్ హెచ్ ఎం జేఏసీ ఐదు రోజుల సమ్మె
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : ఎన్ హెచ్ ఎ జేఏసీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుండి 17 వరకు ఐదు రోజుల సమ్మె నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్ తెలిపారు.తెలంగాణలో ఎన్ హెచ్ ఎం కింద పనిచేస్తున్న 17,000 మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, వార్షిక 5%, 8% బోనస్‌లు అమలు చేయాలని, ఉద్యోగులకు ఈ ఎస్ ఐ, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించాలని, మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు.రాష్ట్ర ఎమ్మెల్యేలు, మంత్రులకు పలుమార్లు సమస్యలను వివరించినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పుట్ట మహేందర్ రావు ఆదేశాల మేరకు సమ్మె చేపడుతున్నట్లు సుమన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పద్మజ, సెక్రటరీ రాజు, మహిళా అధ్యక్షురాలు అశ్విని, ఆర్గనైజింగ్ సెక్రటరీ మౌనిక, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, అడిషనల్ సెక్రటరీలు శీను, నరేష్ తదితరులు పాల్గొన్నారు.