ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ దోచుకుంటున్న వారి పై చర్యలు తీసుకోవాలి
పార్వతీపురం, సూర్య : ఆసుపత్రి శానిటేషన్, సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ కార్మికులకు టెండర్లు పేర్కొన్న విధంగా కాంట్రాక్టులు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి , ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ మన్యం జిల్లా గౌరవధ్యక్షులు ఆర్.వి.ఎస్. కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం స్థానిక డిసిహెచ్ఓ కలిసి వినత పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ఆస్పత్రులలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 138 ప్రకారం 18 వేల 600 రూపాయలు చెల్లించాలని అలాగే పిఎఫ్ ఈ ఎస్ఐ లతో కూడిన వేతనం చెల్లించాల్సి ఉంది అయితే వీటిని కాంట్రాక్టర్ టెండర్స్ లో పేర్కొన్న అంశాన్ని పక్కనపెట్టి కార్మికులకు తక్కువ వేతనం 12వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. అదే మాదిరిగా గత కాంట్రాక్టురు కార్మికుల పిఎఫ్ సొమ్ములను పూర్తిస్థాయిలో చెల్లించకుండా చేతులు దులుపుకున్నారన్నారు. ఆ కాంట్రాక్టు యొక్క టెండర్ సమయంలో కట్టిన డిపాజిట్ నుండి అయినా కార్మికులకు చేందాల్సిన పిఎఫ్ బకాయిలు అందించే విధంగా సంబంధిత శాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. కార్మికుల కష్టాన్ని దోచుకునే విధంగా గత కాంట్రాక్టర్ చేశారని ఆయన దుయ్యి పెట్టారు. ఈ కొత్త కాంట్రాక్టర్ కూడా టెండర్ల పేర్కొన్న విధంగా వేతనాలు ఇప్పించాలని కుమార్ కోరారు. ఈ విషయమై జిల్లా డి సి హెచ్ ఓ డాక్టర్ నాగభూషణం రావు మాట్లాడుతూ ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడడం జరిగిందని ఆయన తెలిపారు.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.