telanagana
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్వై స్ ఛాన్సలర్ అభినందనలు
ఈ అంతర్జాతీయ గుర్తింపుపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ హర్షం వ్యక్తం చేస్తూ పరిశోధకులకు, ప్రొఫెసర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కెమిస్ట్రీ, ప్లాంట్ బయాలజీ నుండి కంప్యూటింగ్, ఇంగ్లీష్ స్టడీస్ వరకు వివిధ విభాగాల శాస్త్రవేత్తల కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని, గ్లోబల్ రీసెర్చ్ మ్యాప్‌లో యూనివర్సిటీ స్థాయిని ఇది మరింత పెంచిందని ఆయన కొనియాడారు. ఈ విజయానికి సహకరించిన విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు మరియు ల్యాబ్ బృందాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు దేశంలోనే టాప్ 20 సంస్థల్లో ఒకటిగా..
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క ఈ అంతర్జాతీయ టాలీ ప్రకారం, భారతదేశంలోని టాప్-20 అత్యుత్తమ విద్యా మరియు పరిశోధనా సంస్థల (ఐఐఎస్సీ, ఐఐటీలతో కలిపి) జాబితాలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం 18వ స్థానాన్ని దక్కించుకోవడం మరో విశేషం రెండు విభాగాల్లోనూ సత్తా చాటిన ప్రముఖులు
ఈ ప్రతిష్టాత్మక జాబితాను రెండు కేటగిరీలుగా (కెరీర్ మొత్తం సాధించిన ప్రగతి మరియు కేవలం ఒక సంవత్సర కాలంలో సాధించిన సైటేషన్ ఇంపాక్ట్) విభజించగా, యూఓహెచ్‌కు చెందిన 12 మంది ప్రొఫెసర్లు రెండు విభాగాల్లోనూ అరుదైన మైలురాయిని అందుకున్నారు. వారిలో ప్రొఫెసర్ గోవర్ధన్ మెహతా, ప్రొఫెసర్ అనునయ్ కె. సమంత, ప్రొఫెసర్ ఆర్. చంద్రశేఖర్ (కెమిస్ట్రీ); ఎ.ఎస్. రాఘవేంద్ర, ఎం.ఎన్.వి. ప్రసాద్, ఎం.కె. అరుణశ్రీ (లైఫ్ సైన్సెస్); సతీష్ ఎన్. శ్రీరామ, నాగేందర్ కె. సూర్యదేవర, డాక్టర్ ఓదేలు వంగ (కంప్యూటర్ సైన్సెస్); శారికా నందన్ కౌల్ (ఫిజిక్స్); సోమ వేణుగోపాల్ రావు (ACRHEM); ప్రమోద్ కె. నాయర్ (ఇంగ్లీష్) ఉన్నారు.