telanagana
సాందీపని డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు...
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి : సాందీపని డిగ్రీ మరియు శ్రీ సాందీపని జూనియర్ కళాశాలలలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి.విద్యార్థినీ, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు.
అత్యుత్తమంగా పేర్చిన బతుకమ్మలకు మెమొంటోలను ప్రధానం చేయడం జరిగింది. బతుకమ్మ డ్రాలో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు పట్టు చీరలను బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు బి బాలాజీ రావు, కళాశాల ప్రిన్సిపల్ ఎస్.సాయి బాబు రెడ్డి, ఉపన్యాసకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.