సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టండి బ్రహ్మల కాలనీ యువత ( పి జి ఆర్ ఎస్ )లో అధికారులకు విన్నపం
కొయ్యలగూడెం , రూరల్ మేజర్ న్యూస్ :రోడ్డు పై ఆక్రమణలను తొలగించి , సీసీ రోడ్డు నిర్మించాలని తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన పి జి ఆర్ లో బ్రహ్మాల కాలనీకి చెందిన కాలనీవాసులు తాసిల్దార్ నాగరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ గత కొంతకాలంగా కాలనీలో కొంతమంది వ్యక్తులు వారి ఇండ్ల సరిహద్దులు దాటి రోడ్డుపైకి వచ్చి ప్రహరీ గోడలు నిర్మించారని ఆరోపణలు చేశారు. మారిశెట్టి రమణ ఇంటి నుంచి బొగ్గవరపు బాబురావు ఇంటి వరకు 100 మీటర్ల పొడవునా 20 సంవత్సరాలుగా కాలనీవాసులు రాకపోకలకు ఉపయోగిస్తున్నారని, ఈ రహదారి గ్రామ పంచాయతీ రికార్డులలో కూడా ఉందని, కాలనీలో నిత్యం ప్రజలు రాకపోకలు కొనసాగించే ఈ మట్టి రోడ్డుపై సిసి రోడ్డు నిర్మించాలని కోరుతూ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో బూసి రామకృష్ణ, పేత్తూరి శ్రీను, పుల్లరి శ్రీనివాస్, చిలకలపూడి సత్యనారాయణ, పడిందల సాయికిరణ్ పాల్గొన్నారు.
రిపోర్టర్ కిషోర్ కొయ్యలగూడెం ఏలూరు జిల్లా,