BREAKING
ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక: ఓలేరులో పోలీస్ శాఖ భారీ కార్డెన్ సెర్చ్ - 44 వాహనాలు సీజ్ … ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

అమ్మవారి దయతో ప్రజలందరికీ అంతా మంచి జరగాలి

Select Suryaa Now
అమ్మవారి దయతో ప్రజలందరికీ అంతా మంచి జరగాలి

 

 ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి…..

 *పతాంజలి యోగ సెంటర్లో భవాని మాత పూజా, అన్నవితరణరణ కార్యక్రమం…

దుర్గామాత ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని , అందరికీ మంచి జరగాలని పాలమూరు ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి ఆకాంక్షించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలసందర్భంగా    షాద్ నగర్ పట్టణంలోని పతంజలి యోగ సెంటర్‌లో కొలువుదీరిన భవానీ మాతను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి స్థానిక బిఆర్ఎస్ నేతలతో కలిసి దర్శించుకున్నారు.దేవీ నవరాత్రులలో భాగంగా కాకునూరు మాజీ సర్పంచ్ యారం శేఖర్ రెడ్డి ఏర్పాటుచేసిన పూజ మరియు అన్న వితరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై  అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. భవానీ మాత అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని,దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలని,ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ నవరాత్రులు కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్ మాజీ కౌన్సిలర్లు రేటికల్ నందీశ్వర్, యుగంధర్,చెట్ల నర్సింహులు,పాలమాకుల చెన్నయ్య,కంటెస్టెంట్ కౌన్సిలర్లు నక్కల వెంకటేష్,రాజేందర్ సింగ్ ,లింగం దాన సర్పంచ్ నాగిల వెంకటేష్,మాజీ సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,శేఖర్ పంతులు,శ్రీనివాస్ రెడ్డి,ఉపసర్పంచ్ యారం రాంరెడ్డి, నాయకులు శ్రీకాంత్ గౌడ్,దినేష్ సాగర్, భక్తులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్….