BREAKING
ముప్కాల్ కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలవుల్లో స్కూలు నడిపితే చర్యలే -నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ స్కూల్‌కు రూ.50 వేల జరిమాన -మంగళం రవితేజ స్కూల్‌పై డీఈఓ కె.వి.ఎన్. కుమార్ కొరడా 'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక: ఓలేరులో పోలీస్ శాఖ భారీ కార్డెన్ సెర్చ్ - 44 వాహనాలు సీజ్ … ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత...  జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి

పార్వతీపురం, సూర్య :  ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ,  రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ డా ఎన్ ప్రభాకర రెడ్డి, జాయింట్ కలెక్టర్ డా వైశాలి, ప్రత్యేక ఉప కలెక్టర్ తో కలసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 75 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, ప్రతి ఫిర్యాదును ఆయన స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యల స్వభావాన్ని బట్టి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఫిర్యాదుదారునికి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా  కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా, అందిన ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పరిష్కరించిన ఫిర్యాదులపై సంబంధిత ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ప్రతి వినతిని కేవలం ఒక అర్జీగా కాకుండా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యగా పరిగణించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి, పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని,  “ప్రతి అర్జీదారుడితో నేరుగా మాట్లాడిన తర్వాతే నివేదిక ఇవ్వాలని,  అర్జీదారుడితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలి” అని ఆదేశించారు. ప్రజలు ఒకే సమస్యతో పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా, అర్జీ స్వీకరణ నుంచి పరిష్కారం వరకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 1100 టోల్‌ఫ్రీ సేవల ద్వారా అందుతున్న వినతులను కూడా అత్యంత బాధ్యతతో పరిష్కరించాలని అధికారులను  ఆదేశించారు. ప్రజలు 1100 సేవలను విస్తృతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. 
జిల్లా కలెక్టర్ స్వీకరించిన వినతులలో కొన్ని ఇలా
*రెవెన్యూ దరఖాస్తులు : ఈ వినతుల స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ వైశాలి, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు ఆర్చిత్ సచిన్ రహార్,  పవర్ స్వప్నిల్ జగన్నాధ్, జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత, ప్రత్యేక ఉప కలెక్టర్ ధర్మరాజు వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.