BREAKING
'ధురందర్ 2' సంగీతం గ్రామీ అవార్డ్స్ ఎంట్రీపై స్పందించిన సింగర్ సోనా మోహపాత్ర.. మేకర్స్ నిర్ణయం సరైనదేనంటూ సమర్థన! లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్లకు  శంకుస్థాపన... శిథిల గృహాల మరమ్మతులకు రాంబాబు భరోసా పేకాట స్థావరంపై  పోలీసుల దాడి... కమ్మర్ పల్లి ఎస్ఐ చిర్ర సతీష్ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 'బాల్యవివాహాల నిషేధం'పై అవగాహన వరిలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తూడెంలో వైసీపీకి భారీ షాక్‌ *:టీడీపీలోకి 80 కుటుంబాలు.. కెటిల్‌బాల్ క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన పోలీస్ అమరవీరుల స్మరణకు ఫ్లాగ్ డే వారోత్సవాలు అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు.. వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు క్యాన్సర్‌తో పోరాటం అనను సరికాదు.. కష్టకాలంలోనూ శరీరానికే తొలి ప్రాధాన్యత ఇస్తూ ప్రేమించా: సోనాలీ బింద్రే భక్తుల సౌకర్యార్థం రెస్ట్‌హాల్‌ షెడ్‌ ప్రారంభం టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఆదడ శ్రీను చేరిక: ఓలేరులో పోలీస్ శాఖ భారీ కార్డెన్ సెర్చ్ - 44 వాహనాలు సీజ్ … ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యదర్శిగా ‘ మొగసాల ’ తారక రామ కాలనీలో ఘనంగా దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు

పేదలకు మెరుగైన వైద్య సేవలు

Select Suryaa Now
పేదలకు మెరుగైన వైద్య సేవలు

నగరం, మేజర్ న్యూస్: 
మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ అన్నారు. సోమవారం సేవా సంకల్పం అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. బాపట్ల, చీరాల ఏరియా వైద్యశాలల నుంచి వచ్చిన ఆయా వైద్య రంగాల్లో నిపుణులు, శస్త్ర చికిత్స వైద్య నిపుణులు, స్థానిక వైద్య సిబ్బంది చర్మవ్యాధులు, చెవి, ముక్కు, గొంతు, ఆర్థోపెడిషియన్, గైనకాలజిస్ట్, చిన్నపిల్లలు, దంత, కంటి తదితర  207 మంది రోగులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభించి, స్థానిక అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో బొర్రా శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ విచారపు వీరయ్య, మాజీ జడ్పిటిసి సభ్యురాలు మాన్యం నాగమణి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చింతల సుబ్బారావు, వైద్యాధికారి మధిర రత్నకుమారి, ఇతర వైద్య నిపుణులు చైతన్య, శాంతకుమారి, మాధురి, కోటేశ్వరరావు, హరిబాబు, విక్టర్ పాల్, రేష్మా, శామ్యూల్ పాల్ ప్రదీప్, కిరణ్, మధు ప్రభాకర్ బాబు, మహేష్, కూటమి నాయకులు మత్తి భాస్కరరావు, శెట్టిపల్లి శ్రీనివాసరావు, లుక్కా గుడారంకయ్య, వెంకట సుబ్బారావు, గూడపాటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.