అదిలాబాద్ జల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ను సన్మానించిన మహేందర్ జాదవ్
సూర్య నేరడిగొండ : అదిలాబాద్ జిల్లా లో ఇటీవల నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన డాక్టర్ ఆడే క్రాంతికుమార్ ని లైవ్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆడే క్రాంతి కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే లక్ష్యంగా రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.