మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన
మంత్రాలయం, సూర్య ప్రతినిధి
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠ దిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు ఘట స్థాపన క్రతువును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సర్వజనుల క్షేమం, శ్రేయస్సు కోసం దుర్గామాత ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ గురుసార్వభౌమ విద్యాపీఠం (ఎస్‌జీఎస్ విద్యాపీఠం) పండితులు, విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రవచనాలు, జ్ఞాన కార్యక్రమాలు, వేదపారాయణం నిర్వహించనున్నారు. అలాగే శ్రీ మంచాలమ్మ సన్నిధిని తమలపాకులతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు. నవరాత్రి ఉత్సవాలతో మంత్రాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.