రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు
సూర్య కోనరావుపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా కోనరావుపేట మండలం మల్కాపేటలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ.. ప్రజలకు పాలనా సేవలను చేరువ చేసేందుకు తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు గుండ వెంకటేష్ గౌడ్, బొజ్జ మల్లేశం, మల్యాల స్వామి దాస్,
మాజీ ఎంపిపి చంద్రయ్య గౌడ్, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి,ఉపసర్పంచ్ తిక్కల నవీన్,
బీఆర్‌ఎస్ నాయకులు మంతెన సంతోష్, గోపు గోపు పర్శరాములు, వంశీ రావు,గోగు ప్రతాప్ రెడ్డి,అరె మహేందర్, జవ్వాజి రవీందర్, సిద్ధంశెట్టి శ్రీనివాస్, ఈర్ల పర్శరాములు,పొట్లపల్లి గోపాల్ రావు,పొన్నం పర్శరాములు,జవ్వాజి దేవయ్య గౌడ్,ఉత్తేమ్ శ్రీనివాస్, పాకాల అంజయ్య గౌడ్, జవ్వాజి అంజయ్య గౌడ్,తదితరులు
పాల్గొన్నారు.