BREAKING
తానాం గ్రామంలో ఆదర్శ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రులు ప్రారంభం మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.… ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం : జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా కళ్యాణదుర్గం గ్రంథాలయంలో గ్రూప్ -1,గ్రూప్ -2 పుస్తకాల ఆవిష్కరణ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి బొంకుల దిబ్బ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రులు

ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం

Select Suryaa Now
ప్రేమ పేరుతో వేధింపులు..  - పదో తరగతి బాలిక బలవన్మరణం

 

సూర్య, వేములవాడ:ప్రేమ పేరుతో వేధింపులకు గురై ఓ పదో తరగతి బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాల్సిన బాలిక వేధింపులు తాళలేక తనువు చాలించిందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది.
ఫోన్ కాల్స్‌, సోషల్ మీడియా సందేశాలతో వేధింపులువివరాల ప్రకారం.. బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో ఫోన్ కాల్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస సందేశాల ద్వారా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై బాలిక కుటుంబ సభ్యులు ముందుగానే యువకుడిని హెచ్చరించినప్పటికీ వేధింపులు ఆగలేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

*కేసు నమోదు.. పోలీసుల దర్యాప్తు* 
బాలిక మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ, వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ రవీందర్ స్పష్టం చేసినట్లు సమాచారం.
బాలిక మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థినుల భద్రత, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వేధింపులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల ఆధారంగా ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి.