సింగరకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.
సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ అనుబంధ ఆలయమైన శ్రీ గాయత్రీ అమ్మవారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో గణపతి పూజ, కలశ స్థాపన మరియు అమ్మవారికి ప్రాతఃకాల పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు వేద పండితులు హరి శంకరావధాని తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ చుండూరు మురళి సుధాకర్ రావు దంపతులతో పాటు సభ్యులు ఉన్నారు.