BREAKING
బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి .. ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య మన్కుగూడలో విబి జీ రామ్ పథకం పనులకు శ్రీకారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది.. - కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి! మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ యూఎస్ 'పెర్మ్' గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌తో మా వ్యాపారానికి ఎలాంటి నష్టం లేదు: ఇన్ఫోసిస్ స్పష్టత.. అసలు కారణాలివే! 14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కి యువతకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి అంతర్జాతీయ సరఫరాల కోసం పుతిన్-ట్రంప్ ఒప్పందం: డీజిల్ ఎగుమతుల నిషేధాన్ని సడలించిన రష్యా!

వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

Select Suryaa Now
వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

 

సూర్య వేములవాడ రూరల్ :రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా మంత్రోచ్ఛారణల నడుమ నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అదేవిధంగా భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​ఈ పూజా కార్యక్రమాలను ఆలయ డిఈఓ ప్రతాప నవీన్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షించగా, పూజకు కావలసిన ద్రవ్యాలను ఆలయ అర్చకులు మరియు వేద పండితులకు అందజేశారు.

​తొలిరోజు "శైలపుత్రి" అలంకారం – విశేష పూజలు ​శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు అమ్మవారు "శైలపుత్రి" అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7:00 గంటల నుండి ఉత్సవాల ప్రారంభం సూచకంగా క్రింది పూజా కార్యక్రమాలు నిర్వహించారు:

​ఉదయకాల పూజలు: స్వస్తి పుణ్యాహవాచనం, పంచగవ్య మిశ్రణం, ఋత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, కలశ ప్రతిష్ట మరియు శ్రీ గాయత్రీ ప్రతిష్టలు జరిగాయి.

​మహా అభిషేకాలు: శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పూర్వక మహాఅభిషేకం, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.

​జపాలు & పారాయణాలు: 9 మంది ఋత్విజులచే శ్రీ సూక్తం, దుర్గాసూక్తం, లలితా సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజలు జరిగాయి. గాయత్రీ మూలమంత్ర జపాలు, గాయత్రీ హవనం, శ్రీమద్భాగవత పురాణ ప్రవచనం మరియు దేవీ చండీ సప్తశతీ పారాయణాలు పూర్తి చేశారు.

​పరివార దేవతలకు పూజలు: ఆలయంలోని పంచాయతన సూక్త పరివార దేవతలైన లక్ష్మీనారాయణ, వేంకటేశ్వర, సోమేశ్వర, మహిషాసురమర్ధిని, సుబ్రహ్మణ్యేశ్వర, కాలభైరవ మరియు నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయి.

​సాయంత్ర విశేషాలు: సాయంత్రం 4:00 గంటల నుండి భీమేశ్వరాలయంలో దేవీభాగవత పురాణ ప్రవచనం, 6:15 నుండి 8:00 గంటల వరకు రాజరాజేశ్వరీ అమ్మవారికి చతుష్షష్ట్యోపచార పూజలు, కన్యాక-సువాసినీ పూజలు మరియు హరిహరుల ఉత్సవ మూర్తుల పల్లకీ సేవ ఊరేగింపు నిర్వహించారు.

​భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు

​దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో కూడా దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక కుంకుమ పూజల సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపారు.

​పూజల తేదీలు: అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు ​కుంకుమ పూజ టికెట్ రుసుము: రూ. 5,000/- ​భక్తులందరూ ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో విశేష సంఖ్యలో పాల్గొని, భీమేశ్వర స్వామివారి మరియు రాజరాజేశ్వరీ అమ్మవారి దివ్య కృపాకటాక్షాలు పొందాలని ఆలయ పి.ఆర్.ఓ (PRO) పెరిక శ్రీనివాస్ ప్రకటన ద్వారా కోరారు.