ఉట్లపల్లిలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు
ఉట్లపల్లిలో ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు
కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామపంచాయతీ పరిధిలోని ఉట్లపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాత దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రుల మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
టి. శ్రీనివాస్ : మేజర్ న్యూస్ కందుకూరు