BREAKING
కేంద్ర మంత్ర కిషన్ రెడ్డిని కలిసిన సుదర్శన్ యాదవ్ సౌదీ విమానాశ్రయంపై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్యసమితి: పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదన్న ఆంటోనియో గుటెర్రెస్! పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యవసర పరిస్థితి విధింపు ఉట్లపల్లిలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు యెమెన్‌లో జోక్యంపై హెచ్చరించిన ఇరాన్: సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం అమల్లోకి రావడంతో పాకిస్తాన్‌పై టెహ్రాన్ విమర్శనాస్త్రాలు! ఆశా వర్కర్ల అరెస్టులు ఆపాలి.. హామీలు అమలు చేయాలి: బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య న్యూఢిల్లీ పరిణామాలపై ఓహెచ్‌సీహెచ్‌ఆర్ వ్యాఖ్యలను ఖండించిన భారత్ 58 బిలియన్ డాలర్ల విద్యుత్ రంగ ప్రణాళికలో పాకిస్తాన్‌కు పెను సవాళ్లు: అప్పుల సంక్షోభం, ఆర్థిక నష్టాల ముప్పుపై నిపుణుల హెచ్చరిక! బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు తొలి ప్రయత్నంలోనే నీట్‌లో సీటు -- నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ లో చేరిక రియాద్ విమానాశ్రయంపై హౌతీల దాడిని ఆపాలి భారత్ పిలుపు సింగరకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కరుణ జూపే దయగల తల్లి శ్రీలక్ష్మి అమ్మవారు. హౌతీలపై పోరుకు దిగే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్

రహత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 80 భూమిపై గ్రామస్తుల స్పష్టీకరణ

Select Suryaa Now
రహత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 80 భూమిపై గ్రామస్తుల స్పష్టీకరణ

 

సూర్య,భీమ్‌గల్ :భీమ్‌గల్ మండలం రహత్‌నగర్ గ్రామంలోని సర్వే నంబర్‌ 80 భూమి విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ భూమి ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని, గ్రామానికి సంబంధించిన ఆస్తి కావడంతో గ్రామస్తులంతా కలిసి చర్చించి స్పష్టతనిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలో అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో పటేల్‌–పట్వారీ వ్యవస్థ ఉన్న సమయంలో భూములకు శిస్తు, పన్నులు చెల్లించి పట్టాలు పొందినట్లు వివరించారు. అప్పట్లో తమ వద్ద పనిచేసిన వడ్ల, కుమ్మరి, సుంకరి వర్గాలకు కొన్ని భూములు కేటాయించారని, సుంకరి కుటుంబానికి 10 ఎకరాల 26 గుంటల భూమి ఇనాంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాలక్రమంలో ఆ కుటుంబం కనుమరుగవడంతో సదరు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. భూమి ఆక్రమణకు ప్రయత్నాలు జరగడంతో గ్రామస్తులంతా కలిసి దానిని ప్రభుత్వానికి అప్పగించినట్లు వెల్లడించారు.గత వారం రోజులుగా ఈ భూమికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, రెవెన్యూ శాఖ ఆర్‌ఐ అధికారిణి గ్రామానికి వచ్చి సర్వే నంబర్‌ 80లో అక్రమంగా ఏర్పాటు చేసిన మోటారును తొలగించే ప్రయత్నం చేసిన సమయంలో పోలీసులు శాంతిభద్రతలను కాపాడేందుకు తమ విధులు నిర్వర్తించారని తెలిపారు. అయితే పోలీసులు ఎస్‌ఐ తిరుపతి, మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులకు సహకరిస్తున్నారంటూ వీడియోలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

మహేష్ కుమార్ గౌడ్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిగా పేరొందారని, ఆయనపై రాజకీయ రంగు పులుముతూ ఆరోపణలు చేయడం సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో జరిగిన విషయాలను గ్రామస్తులంతా కలిసి చర్చించుకున్నామని, వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను ప్రచారం చేయడం నిలిపివేయాలని, లేనిపక్షంలో బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు వస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ లకావత్ తిరుపతి, ఉపసర్పంచ్ భూక్య సేవలాల్, మాజీ జడ్పీటీసీ బాధావత్ శర్మ నాయక్, మాజీ సర్పంచ్ రాజ్ నాయక్, మాజీ ఎంపీటీసీ వినుకొండ ధర్మపురి, దాసరి నర్సయ్య, జరుపుల రాములు, భూక్య షబిలాల్, బాణావత్ శ్రీనివాస్, భూక్య నర్సింగ్ నాయక్, కొండపల్లి రాజు, చెరుకు రాజు, బాధావత్ బాలు, మాలవత్ లింబాద్రి, దొంతుల మధు, కొండపల్లి అజయ్ తదితర గ్రామ పెద్దలు, అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.