సీ సీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
దుద్యాల్, మేజర్ న్యూస్: మండల పరిధిలో ని సంత్రకుంట తండా లో సీ సీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ మాణిక్య నాయక్, ఎస్టీ అధ్యక్షుడు రవి నాయక్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లో తండాలు సంపూర్ణంగా అభివృద్ధి చెండుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.