రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు..
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలం,కొత్తపల్లె సమీపంలోని పాత రైస్ మిల్లు వద్ద ఆదివారం ఎలపవారికోటకు చెందిన సాంబశివ తంబళ్లపల్లెకు వెళ్తుండగా గోపిదిన్ని కొత్తపల్లెకు చెందిన నవీన్ కుమార్ (19) పొలం వద్దకు వెళ్తుండగా ప్రమాదంలో ఎదురు ఎదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్.. తంబళ్లపల్లె