BREAKING
కులవృత్తులకు అండగా బీజేపీ బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి .. ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య మన్కుగూడలో విబి జీ రామ్ పథకం పనులకు శ్రీకారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది.. - కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి! మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ యూఎస్ 'పెర్మ్' గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌తో మా వ్యాపారానికి ఎలాంటి నష్టం లేదు: ఇన్ఫోసిస్ స్పష్టత.. అసలు కారణాలివే! 14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కి యువతకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి

బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే

Select Suryaa Now
బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం తీవ్రంగా ఖండించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు రాజకీయ గుర్తింపు, రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకే ఉందని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం చేసిన వారే ఇప్పుడు నీతులు చెబుతూ, ప్రాంతాలవారీగా సమావేశాలు పెట్టి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

*టీడీపీ హయాంలోనే బీసీలకు రాజకీయ గుర్తింపు*

1987లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు నాయకత్వంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని, 1995లో వాటిని 34 శాతానికి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని రెడ్డి సుబ్రహ్మణ్యం వివరించారు. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆయన ఆరోపించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించేందుకు న్యాయపోరాటం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

*రాజమహేంద్రవరం, సమావేశాలు పెట్టి విమర్శలా?*

బీసీలకు తాము ఏం చేశామో చెప్పుకోలేని వైసీపీ నాయకులు రాజమహేంద్రవరంలో సమావేశాలు నిర్వహిస్తూ విమర్శలు చేయడం ఏమిటని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు.ఐదు రీజియన్లలోనూ సమావేశాలు పెట్టడానికి సిద్ధమై విమర్శలు చేస్తూ తిరగడం కాదని, బీసీలకు గతంలో ఏం చేశారో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. “బీసీలకు మీరు ఏం చేశారు? మేము ఏం చేశాము? చర్చకు రండి.. మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ సవాల్ చేశారు.

వైసీపీ నాయకుల విమర్శలను ఉద్దేశిస్తూ, “బీసీలకు ఏం చేయకుండా ఇప్పుడు గ్రామసింహాల్లా బౌ.. బౌ.. మని మొరుగుతున్నారు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని, రాజకీయ విమర్శలతో బీసీలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు.

*50 శాతం పరిమితి నేపథ్యంలో న్యాయపోరాటం*

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితి కీలకమని పేర్కొన్న రెడ్డి సుబ్రహ్మణ్యం, బీసీలకు సాధ్యమైనంత న్యాయం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బీసీలకు మెరుగైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం న్యాయపరమైన మార్గాలను పరిశీలిస్తోందని తెలిపారు. స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి అవసరమైన నిధులు పొందడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు.

బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీ రక్షణ చట్టం తీసుకురావడంతో పాటు ఆదరణ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గీత కార్మికులకు మద్యం దుకాణాలు, బార్లలో 10 శాతం రిజర్వేషన్, లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలన్న ప్రభుత్వ హామీలను కూడా ప్రస్తావించారు. చెట్టుపై నుంచి పడి మరణించే గీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించే అంశాన్ని వివరించారు.

*బీసీలకు ఏం చేశారో చర్చకు రండి*

బీసీ నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే, సర్దార్ గౌతు లచ్చన్న, దొమ్మేటి వెంకటరెడ్డి, కవయిత్రి మొల్లమ్మ వంటి ప్రముఖులను గౌరవించే కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోందని రెడ్డి సుబ్రహ్మణ్యం తెలిపారు.బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో ఎవరు ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని వైసీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. విమర్శలు చేయడం సులభమని, కానీ బీసీలకు చేసిన మేలు, జరిగిన నష్టం గురించి వాస్తవాలతో మాట్లాడాలని హితవు పలికారు.