ఉరవకొండ అభివృద్ధి నివేదిక సీఎంకు అందజేత
*నియోజకవర్గ అభివృద్ది కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించిన మంత్రి పయ్యావుల*
సూర్య స్టేట్ బ్యూరో,అమరావతి : ఉరవకొండ నియోజకవర్గ అభివద్ది పనులను వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం చంద్రబాబుకు అందించారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో జరిగిన సమగ్ర అభివృద్దిని వివరిస్తూ పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రోగ్రెస్ కార్డులా ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ది కార్యక్రమాలను క్లుప్తంగా వివరిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఉరవకొండకు తాగునీరు, హంద్రీ నీవా కాలువ వెడల్పుతో జరిగిన లబ్ది, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పల్లెల్లో సిమెంట్ రోడ్లు, నూతన భవనాల మంజూరు వంటి కార్యక్రమాలను వివరిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించారు. రెండేళ్లలో గ్రామస్థాయిలో తీసుకువచ్చిన అన్ని మార్పులను ఇందులో పొందుపరిచినట్లు ఉరవకొండ ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. నియోజకవర్గాల్లో అభివృద్ది పనులు చేయడంతో పాటు....ఆయా పనుల వివరాలను కూడా నిత్యం ప్రజలకు వివరించాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. గత ప్రభుత్వంలో విధ్వంసానికి, కూటమి ప్రభుత్వంలో వికాసానికి మధ్య తేడాను వివరించేలా ఎమ్మెల్యేలు ఈ తరహా నివేదికలను, ప్రోగ్రెస్ కార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు, లిఫ్ట్ ప్రాజెక్టులు మంజూరు చేసి నియోజక అభివృద్దికి సహకరిస్తోన్న ముఖ్యమంత్రికి మంత్రి కేశవ్ ధన్యవాదాలు తెలిపారు.