BREAKING
తానాం గ్రామంలో ఆదర్శ మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దుర్గా దేవి నవరాత్రులు ప్రారంభం మొయినాబాద్ మండల కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్‌గా ఎం. దాసు నియామకం భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రులు ప్రారంభం.… ఎస్విఎల్ కళాశాలలో ఘనంగా దసరా వేడుకలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం-జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దుర్గామాతకు వెండి త్రిశూలం బహుకరణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు పక్రియకు ఇన్చార్జీలు నియామకం.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మున్సిపల్ కమిషనర్ తీరుపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తాం : జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న రాజా కళ్యాణదుర్గం గ్రంథాలయంలో గ్రూప్ -1,గ్రూప్ -2 పుస్తకాల ఆవిష్కరణ ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తగా ఇ రిగెల రాంపుల్లారెడ్డి పబ్లిక్ టాయిలెట్స్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి-ఏఐటియుసి బొంకుల దిబ్బ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన దేవీ నవరాత్రులు

కళ్యాణదుర్గంలో వైసీపీలోకి చేరికలు మాజీ ఎంపీ తలారి రంగయ్య సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేత రోషన్

Select Suryaa Now
కళ్యాణదుర్గంలో వైసీపీలోకి చేరికలు  మాజీ ఎంపీ తలారి రంగయ్య సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ నేత రోషన్

అనంతపురం బ్యూరో : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య సమక్షంలో టీడీపీ ముఖ్య నాయకుడు రోషన్‌తో పాటు రెవెన్యూ కాలనీకి చెందిన పలువురు కుటుంబాలు వైసీపీలో చేరాయి. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తలారి రంగయ్య నాయకత్వంపై నమ్మకంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, ముస్లిం మైనార్టీల సమస్యల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ టీడీపీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అబ్జర్వర్ సోమనాథ్ రెడ్డి, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంత రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్రంపల్లి కృష్ణమూర్తి, మండల కన్వీనర్లు గోళ్ల సూరి, పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఎంఎస్ హనుమంత రాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.