BREAKING
కులవృత్తులకు అండగా బీజేపీ బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి .. ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య మన్కుగూడలో విబి జీ రామ్ పథకం పనులకు శ్రీకారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది.. - కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి! మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ యూఎస్ 'పెర్మ్' గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌తో మా వ్యాపారానికి ఎలాంటి నష్టం లేదు: ఇన్ఫోసిస్ స్పష్టత.. అసలు కారణాలివే! 14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కి యువతకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి

రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.*

Select Suryaa Now
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.*

అన్నమయ్య జిల్లా - మదనపల్లె

*రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ  ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.*

మదనపల్లె, అక్టోబర్ 11: అన్నమయ్య జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు *జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్,..* అన్ని స్థాయిల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ప్రక్రియ ముగిసే వరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పోలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

సమస్యాత్మక కేంద్రాలను ముందుగానే గుర్తించాలి. పాత నేరస్థులు, గొడవలు సృష్టించే వారిని తక్షణమే బైండోవర్ చేయాలి. అసాంఘిక శక్తులను అరికట్టేందుకు ముమ్మరంగా 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్లు నిర్వహించాలి.

అక్రమాలను అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ, ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు (ఫేక్ న్యూస్) చేసే వారిని గుర్తించి, వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి.

ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు గ్రామాల్లో పర్యటనలు, 'పల్లెనిద్ర' వంటి కార్యక్రమాలు చేపట్టి వారిలో ధైర్యం నింపాలి.

జిల్లాలో లైసెన్స్ కలిగిన తుపాకులు, ఇతర ఆయుధాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి, వాటిని పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయించాలి.

ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరి బెదిరింపులకు భయపడకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ గారు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 పి గౌరీ శంకర్ స్టాప్ రిపోర్టర్ తంబళ్లపల్లె