BREAKING
కులవృత్తులకు అండగా బీజేపీ బోయినపల్లి మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా చల్ల శ్రీనివాసరెడ్డి .. ప్రేమ పేరుతో వేధింపులు.. - పదో తరగతి బాలిక బలవన్మరణం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ శంకుస్థాపన పనులను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర నాయకులు తుమ్మల యుగంధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకలు దసరా పండుగకు విద్యుత్ దీపాల ఏర్పాటు.. సూర్య మన్కుగూడలో విబి జీ రామ్ పథకం పనులకు శ్రీకారం జిల్లా ఆవిర్భావ దశాబ్ది.. - కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం వాస్తవాలను పక్కదారి పట్టించడమే జగన్‌ రాజకీయ నీతి! మంత్రాలయం శ్రీ మఠంలో ఘనంగా ఘట స్థాపన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ యూఎస్ 'పెర్మ్' గ్రీన్ కార్డ్ సస్పెన్షన్‌తో మా వ్యాపారానికి ఎలాంటి నష్టం లేదు: ఇన్ఫోసిస్ స్పష్టత.. అసలు కారణాలివే! 14న రెడ్డి మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని గెలిపించండి ఐదున్నర కిలోమీటర్లు సైకిల్ తొక్కి యువతకు దిశా నిర్దేశం చేసిన కేంద్ర మంత్రి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

Select Suryaa Now
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్

సూర్య, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, యువతలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్  పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఆయా సబ్ డివిజన్ల పోలీస్ అధికారుల సూచనలతో జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో సంబంధిత పోలీస్ అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో *రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రహ్‌వీర్ (Rah-Veer* ) పథకంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, యువత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు సకాలంలో సహాయం అందించి, వారి ప్రాణాలను కాపాడేందుకు ఆసుపత్రికి చేసిన ఒక్కో రహవీర్ కు 25,000/నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం అందించే అవకాశం ఉంది. కావున అత్యవసర సమయంలో రోడ్డు ప్రమాదం నుండి బాధితులకు సహాయం చేయడానికి భయపడకుండా, వెంటనే సంబంధిత అత్యవసర సేవలకు సమాచారం అందించాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని, కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తాము రోడ్డు భద్రతా నియమాలను పాటించడంతో పాటు, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*