BREAKING
కేంద్ర మంత్ర కిషన్ రెడ్డిని కలిసిన సుదర్శన్ యాదవ్ సౌదీ విమానాశ్రయంపై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన ఐక్యరాజ్యసమితి: పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదన్న ఆంటోనియో గుటెర్రెస్! పాకిస్తాన్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యవసర పరిస్థితి విధింపు ఉట్లపల్లిలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు యెమెన్‌లో జోక్యంపై హెచ్చరించిన ఇరాన్: సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం అమల్లోకి రావడంతో పాకిస్తాన్‌పై టెహ్రాన్ విమర్శనాస్త్రాలు! ఆశా వర్కర్ల అరెస్టులు ఆపాలి.. హామీలు అమలు చేయాలి: బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణయ్య న్యూఢిల్లీ పరిణామాలపై ఓహెచ్‌సీహెచ్‌ఆర్ వ్యాఖ్యలను ఖండించిన భారత్ 58 బిలియన్ డాలర్ల విద్యుత్ రంగ ప్రణాళికలో పాకిస్తాన్‌కు పెను సవాళ్లు: అప్పుల సంక్షోభం, ఆర్థిక నష్టాల ముప్పుపై నిపుణుల హెచ్చరిక! బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు తొలి ప్రయత్నంలోనే నీట్‌లో సీటు -- నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ లో చేరిక రియాద్ విమానాశ్రయంపై హౌతీల దాడిని ఆపాలి భారత్ పిలుపు సింగరకొండలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కరుణ జూపే దయగల తల్లి శ్రీలక్ష్మి అమ్మవారు. హౌతీలపై పోరుకు దిగే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్

ఏపీ రాజకీయాలలో లెజెండరీ లీడర్ పెద్దిరెడ్డి

Select Suryaa Now
ఏపీ రాజకీయాలలో లెజెండరీ లీడర్ పెద్దిరెడ్డి


- ఎమ్మెల్యే,మంత్రిగా ఏపీ అభివృద్ధికి ఆయన సేవలు అమోఘం
- వైకాపా రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా ప్రశంసలు
మదనపల్లె,మేజర్ న్యూస్ : ఏపీ రాజకీయాలలో మాజీ మంత్రి,పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఓ లెజెండరీ లీడర్ అని వైకాపా రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ఎస్.ఏ కరీముల్లా పేర్కొన్నారు.ఆదివారం 21వ వార్డులోని వైకాపా కార్యాలయంలో పెద్దిరెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి.ఎస్.ఏ.కరీముల్లా,మాజీ కౌన్సిలర్ షేక్ షబానా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలకు స్టేట్ ఇరిగేషన్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ దండాల రవిచంద్రా రెడ్డి,ఎస్.ఇబ్రహీం (హాజీ),రఫీ,రమాదేవి తదితలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్.ఏ.కరీముల్లా,దండాల రవిచంద్రా రెడ్డిలు మాట్లాడుతూ రాజకీయాలలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సుదీర్ఘంగా ప్రజాసేవలు అందిస్తున్నారన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఓటమి ఎరుగని నాయకుడుగా చరిత్ర సృష్టించారని కొనియాడారు.ఎమ్మెల్యేగా,మంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు.మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ఆయనది ప్రత్యేక అనుబంధమన్నారు.నిరంతరం ప్రజాశ్రేయస్సుకై పరితపించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకార్తలు,వార్డు ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి