వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం
అనంతపురం బ్యూరో : బ్రహ్మసముద్రం మండలం ఎర్రప్పదొడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుడు గొల్ల బసవరాజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం వైసీపీ నాయకుడు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆదివారం ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ పాలకొండ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తలారి సత్యప్ప, జిల్లా పంచాయతీ విభాగం కార్యదర్శి గోపాల్ రెడ్డి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యదర్శి మల్లికార్జున, మాజీ ఎంపీటీసీ నాగలక్ష్మి, మాజీ డీలర్ సునీత, విద్యార్థి విభాగం అధ్యక్షుడు గోపి తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.