దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ
అనంతపురం బ్యూరో : దసరా పండుగను పురస్కరించుకుని అనంతపురం నగరంలోని 50వ డివిజన్‌లో 47 మంది మున్సిపల్ కార్మికులు, కార్పొరేటర్ కార్యాలయ సిబ్బందికి వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ నలుబోలు శ్రీలక్ష్మి, రాయల్ మధు ఆధ్వర్యంలో నిర్వహించారు.
పండుగ వేళ కార్మికులు, సిబ్బందికి దుస్తులు అందజేసి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. ప్రజలకు సేవలందించే కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.