BREAKING
శ్రీదేవి కంటే ముందే ఆ అమ్మాయిని 10 ఏళ్లు ప్రేమించా: తొలి ప్రేమపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో దర్శనమిచ్చిన నల్ల పోచమ్మ అమ్మవారు ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు బాలీవుడ్‌లో హింసాత్మక చిత్రాలదే రాజ్యమనేది ఒక భ్రమ మాత్రమే: నటుడు గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు! కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత రాజమహేంద్రవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో ఘన స్వాగతం.. కపిలేశ్వరపురంలో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం వచ్చే నెలలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం సిజిపి నిరసనలపై మండిపడ్డ కంగనా రనౌత్: దేశాన్ని అస్థిరపరిచేందుకు దేశద్రోహ శక్తుల కుట్ర అంటూ ఆగ్రహం! దేవుని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం పాకల బీచ్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పరామర్శ

ఈ నెల 19న ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్

Select Suryaa Now
ఈ నెల 19న ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్

హైదరాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11):

తపాలా సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో ఈ అదాలత్ నిర్వహించనున్నారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట జిల్లాల ప్రజలు ఇండియా పోస్ట్ సేవలకు సంబంధించిన తమ ఫిర్యాదులను ఈ నెల 17వ తేదీలోగా పంపించాలని అధికారులు సూచించారు. ఫిర్యాదులను శ్రీ ఆర్. సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్-II, పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం, హెడ్‌క్వార్టర్స్ రీజియన్, జామా-ఇ-ఉస్మానియా పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్, హైదరాబాద్-500007 చిరునామాకు పంపించాలి.ఫిర్యాదులను స్పష్టంగా రాయడంతోపాటు కవరు వెలుపల తప్పనిసరిగా ‘రీజినల్ లెవెల్ డాక్ అదాలత్’ అని పేర్కొనాలి. ఫిర్యాదుతోపాటు మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పూర్తి చిరునామాను పొందుపరచాలి. ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొనేందుకు అవసరమైన లింక్‌ను ఫిర్యాదుదారుల మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్‌కు పంపిస్తారు.సిబ్బందికి సంబంధించిన అంశాలు, సేవా విషయాలు, న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించిన ఫిర్యాదులను ఈ అదాలత్‌లో స్వీకరించబోమని అధికారులు స్పష్టం చేశారు. తపాలా సేవల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.