పాకల బీచ్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పరామర్శ
సూర్య ప్రతినిధి,ఒంగోలు :
పాకల బీచ్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడి ఒంగోలులోని సంఘమిత్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న ఆయన క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.