BREAKING
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్ అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్

సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి:

Select Suryaa Now
సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి:

సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి

  • ​రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి
  • ​కొత్త క్యాంపస్ పూర్తయ్యే దాకా ప్రస్తుత ప్రాంగణంలోనే తరగతులు కొనసాగించాలి
  • ​విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం జోక్యం చేసుకోవాలని డిమాండ్

​హైదరాబాద్:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

​2021లోనే రూ.402 కోట్ల పరిపాలనా అనుమతులతో ఈ కళాశాల శాశ్వత ప్రాంగణం మంజూరైందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇందుకోసం మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల భూమిని కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. దీంతో ప్రస్తుతం కళాశాల అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో తాత్కాలికంగా నడుస్తోందని వివరించారు.

​కళాశాలను ఇప్పుడున్న ప్రాంగణం నుంచి ఏదైనా ప్రైవేటు భవనానికి తరలించాలనే ప్రతిపాదనలు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న తరగతి గదులు, ప్రయోగశాలలు (ల్యాబ్‌లు), ఇతర మౌలిక వసతులు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

​ఈ నేపథ్యంలో మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత భవన నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొత్త క్యాంపస్ పనులు పూర్తయ్యేంత వరకు కళాశాలను ప్రస్తుత ప్రాంగణంలోనే కొనసాగించేలా అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు. సరైన ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుత భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయవద్దని సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎంను కోరారు.

​రాజన్న సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల గ్రామీణ, పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ఈ సంస్థ ఎంతో కీలకమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.