స్వామివారికి నూతన పట్టువస్తాలు సమర్పించిన మిథున్
మహబూబ్ నగర్సూ,ర్య ప్రతినిధి:
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ సింహగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు శ్రీ శ్రీ శ్రీ కామేశ్వరీ సమేత ఐశ్వర్వేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ ,టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపి మిథున్ రెడ్డి మరియు కార్పొరేటర్ యాదయ్య స్వామివారికి సువర్ణ నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా మహబూబ్‌నగర్ గ్రేన్స్ & సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ భవనం నుంచి ఆలయ సుందరీకరణ కమిటీ సభ్యులు,అసోసియేషన్ సంఘ ప్రతినిధులు,ఆలయ ప్రతినిధులు,భక్తులతో కలిసి మంగళ వాయిద్యాల నడుమ దేవస్థానానికి ఘనంగా ఊరేగింపుగా చేరుకున్నారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు