BREAKING
కరుణ జూపే దయగల తల్లి శ్రీలక్ష్మి అమ్మవారు. హౌతీలపై పోరుకు దిగే అంశాన్ని పరిశీలిస్తామన్న ట్రంప్ రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ -శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు -అల్లర్లకు దూరంగా ఉండాలని హెచ్చరిక చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ వేములవాడలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం బీసీలకు వెన్నుపోటు పొడిచింది గొడ్డలి పార్టీయే బాలిక విద్య, ఆరోగ్యం మహిళా ప్రగతికి రెండు కళ్ళు అంతర్జాతీయ బాలికా దినోత్సవ ర్యాలీలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు ప్రశాంతంగా ముగిసిన ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత కోచింగ్ ఎంట్రెన్స్ పరీక్ష -- పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్పీ వినీత్ -- అభ్యర్థులకు ఉచిత భోజనం అందించిన లయన్స్ క్లబ్ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు- జిల్లా వ్యాప్తంగా రహ్‌వీర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి-జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఓటర్ల డేటాను ట్రంప్ ప్రభుత్వం వినియోగించడం చట్టవిరుద్ధం: యూఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు! స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ చీర కట్టుకున్నందుకు 'బెహన్‌జీ' అని పిలిచారు: ఎయిర్‌పోర్ట్ అనుభవాన్ని గుర్తుచేసుకున్న రాజ్యసభ ఎంపీ సుధామూర్తి! రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపై అధికారులకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. దిశానిర్దేశం.* యెమెన్‌లోని హౌతీలపై సౌదీ అరేబియా భీకర ప్రతీకార దాడులు: రియాద్ విమానాశ్రయంపై దాడికి ప్రతిస్పందన.. నగరంలో పాఠశాలలు మూసివేత! పాముకాటుకు యువకుడు మృతి. నంద్యాల వైసీపీ నేతలకు పార్టీ కీలక పదవులు

రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026

Select Suryaa Now
రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026

Weekly Rasi Phalalu | 11 Oct 2026 – 17 Oct 2026 | అక్టోబర్ 11, 2026 – అక్టోబర్ 17, 2026 ద్వాదశ రాశుల వార ఫలాలు. Discover your weekly astrological insights with Dr. Edupuganti Padmaja Rani.

 

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ,  లూ, లే, లో,ఆ)

ప్రారంభంలో సాంఘిక సంబంధాలు గుర్తింపు గౌరవం. భాగస్వామితో, మరియు వ్యాపార వ్యవహారాల్లో, మిత్రులతో కమ్యూనికేషన్ లో జాగ్రత్త అవసరం. కుటుంబ ఆరోగ్య, రుణ, న్యాయ, వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు. మధ్యలో వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ, ఆలోచనలలో తొందరపాటు లేకుండా, విద్య, స్థిరాస్తులు,డ్రైవింగ్ వంటి విషయాలలో శ్రద్ధ ముఖ్యం. తల్లి ఆరోగ్యపై దృష్టి. అనవసర వాదాలకు దూరంగా ఉండాలి. వారాంతం ఉన్నత విద్య, ఆధ్యాత్మిక దూర ప్రయాణాల ఆలోచనలు, కుటుంబ సభ్యులతో, గురువుతో చర్చలు. పని ఒత్తిడి, నిద్రలేమి. అసంతృప్తి అధిగమించాలి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన మేలు.

వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  

ప్రారంభంలో అధిక శ్రమతో అనుకున్న పనుల సాధన. కీలక విషయాలు బంధు, మిత్రులతో చర్చలు. స్త్రీలతో వీలైనంత ఆచితూచి వ్యవహరించాలి. రొటీన్లో మార్పులు. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ. మధ్యలో భాగస్వామి ఆరోగ్యశ్రద్ధ మరియు కమ్యూనికేషన్లో అపార్ధాలు అధిగమించాలి. ప్రశాంతత తక్కువ. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. సాంఘిక సంబంధాలలో, కొత్త పరిచయాలలో జాగ్రత్తలు ముఖ్యం. ఆర్థికాంశాలలో మార్పులు. వారాంతం ముఖ్య విషయాలు వాయిదాలకి అవకాశం. ఆర్థిక లాభాలలో ఆకస్మిక నిర్ణయాలు, సజ్జన సహకారం లభ్యం. పెట్టుబడులలో ఆలోచనలను, నెట్వర్క్ పెంచుకుంటూ తండ్రి, పెద్దల ప్రోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేయడానికి ప్రయత్నం. గౌరీ ఆరాధన మేలు.

మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  

ప్రారంభంలో ఆత్మీయుల కొరకు మిత్రులతో, సంతాన వర్గంతో కలసి వినోదాలు, వ్యక్తిగత షాపింగ్లు ఖర్చులు అధికం. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆర్థిక అంశాలు అనుకూలం, బంధు మిత్రుల కలయిక. మాటలలో నిదానం అవసరం. ఉపాసన పెంచుకుంటూ హృదయాం దోళన అధిగమించాలి. మధ్యలో అధికశ్రమతో ఉద్వేగాలు అధిగమిస్తు, రోగనిరోధకశక్తి పై దృష్టి, పూర్వ బకాయిలు పొందే ప్రయత్నాలు.  దంత, నేత్ర ఆరోగ్య శ్రద్ధ. వారాంతం సంఘములో గుర్తింపు గౌరవం, ఆర్థిక విషయాలు, మాటవిలువ అనుకూలం. భాగస్వామి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. వృత్తి వ్యాపార విషయాలలో శ్రమతో ఆశించిన వృద్ధి. దత్తాత్రేయ ఆరాధన మేలు.

కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)

ప్రారంభంలో స్థిరాస్తులు, గృహ, విద్య విషయాలు, తల్లి తరపు బంధు మిత్రుల కలయిక నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ. వాహన లాభం. స్త్రీల సహకారం. షాపింగ్లు. మధ్యలో ప్రశాంతత తక్కువ. ఉద్వేగాలధికం. సంతాన, వృత్తిపరంగా అధిక ఆలోచనలు, మార్పులకై కొత్త అనుకూల నిర్ణయాలు ఆత్మీయ వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు, మీ ఆలోచనలు, వారి ఆలోచనలతో సమన్వయము కొరకు అధిక శ్రమ, హృదయాందోళనకు తావివ్వరాదు. వారాంతం రొటీన్లో వ్యక్తిగత, ఆరోగ్య అంశాలలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. ఆలస్యమైన రుణ, వృత్తిపరమైన విషయాలలో ఒత్తిడితో పనులు సాధిస్తారు. సంతాన ఆరోగ్య, అభివృద్ధికి ఖర్చులు. ప్రత్యర్థుల మీద విజయం. హనుమాన్ చాలీసా మేలు.

సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం)  (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)

ప్రారంభంలో పరాక్రమంతో నైపుణ్యంతో పనులు పూర్తి. ఆకస్మిక ప్రయాణాలకు, ఆత్మీయులకు ఖర్చులు. ఆన్లైన్ షాపింగ్ లు. దూర ప్రయాణాలలో కుటుంబ అవసరాలకి, పెద్ద లకి ఆధ్యాత్మిక అంశాలకి, సంతానవర్గ అభివృద్ధికి, రుణ విషయాలకి, పుణ్య కార్యక్రమాలకి ఆకస్మికంగా సహకరిస్తారు. మధ్యలో తల్లి ఆరోగ్యం, భూ, స్థిరాస్తులు, గృహ, వాహన విషయాలు పై అధిక శ్రద్ధ. ప్రశాంతత తక్కువ. ఉద్వేగాలు లేకుండా విద్యార్థులు విద్యపై దృష్టి సారించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వారాంతం సంతాన ఆరోగ్య శ్రద్ధ, ఖర్చులు. హృదయాందోళన అధిగమించాలి. భాగస్వామితో  చర్చలు. కమ్యూనికేషన్ జాగ్రత్తలు ముఖ్యం. విష్ణుమూర్తి ఆరాధన మేలు.

కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)

ప్రారంభంలో ఆర్థిక విషయాలు, మాట విలువ, కుటుంబ సంబంధాలు, పెద్దలతో అనుకూలత, కమ్యూనికేషన్, భూఅంశాలు ఆశించిన విధంగా ఉంటాయి. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్ వంటివి చేస్తారు. నాయకత్వ లక్షణాలు అధికం. మిత్ర, బంధు కలయిక. వేగంగా పనులు నిర్వర్తిస్తారు. మధ్యలో అధికశ్రమతో ఆగిన పనులు పూర్తి. మిత్రులతో చర్చలు. నెట్వర్క్అనుకూలం. కొత్త ప్రదేశాలలో, కొత్త వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించాలి. పెద్దల ఆశీస్సులు లభ్యం. వారాంతం స్థిరాస్తి, విద్య, గృహ వ్యవహారాలలో తల్లి, భాగస్వామితో చర్చలు. అనుకూల నిర్ణయాలు. ఆలస్యమైన పనులు ముందుకు వెళతాయి. ఆదిత్య హృదయ పారాయణ మేలు.

తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    

ప్రారంభంలో వృత్తి విషయాలలో  పెద్దల సహకారంతో, సృజనాత్మకతతో అభివృద్ధి కొరకు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య, ఆహార శ్రద్ధ ముఖ్యం. ఆధ్యాత్మిక వ్యక్తుల పరిచయాలు, ఆశీస్సులు. బహుమతులు లభ్యం. దూర ప్రయాణాలకు, బంధువుల కలయిక అవకాశం. కమ్యూనికేషన్ లో శ్రద్ధముఖ్యం. మధ్యలో వాగ్దానాలు, మాట విలువ, ఆర్థిక, కుటుంబ అంశాలలో కుటుం బముతో చర్చల యందు నిదానంగా వ్యవహ రించాలి, కంటి ఆరోగ్య శ్రద్ధ అవసరం. వారాంతం వృత్తిలో అనుభవజ్ఞులైన వ్యక్తుల సహకారం, మంచి చర్చలు, ఆధ్యాత్మిక మందిర దర్శనాలు, గౌరవం. శ్రమతో పనుల సాధన. ప్రయాణాలలో, ఆలోచనలలో జాగ్రత్త అవసరం. అమ్మవారి ఆరాధన మేలు.

వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   

ప్రారంభంలో శ్రమ ఒత్తిడి అధికం. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ. ప్రశాంతత తక్కువ. నిద్రలేమి. భాగస్వామికి, సంతాన రీత్యా షాపింగ్ లకి ఖర్చులు అధికం. బంధువుల కలయిక. ఆత్మీయులతో కమ్యూనికేషన్ జాగ్రత్తలు అవసరం. వారం మధ్యలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. తండ్రి అభిప్రాయములను గౌరవించాలి.  గురువులతో సంప్రదింపులు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మందిరాలు, కార్యక్రమాలు, సంబంధ ఖర్చులు. వారాంతం ఆర్థిక విషయాలు సామాన్యం. కుటుంబ అవసరాలకి, సంతాన వర్గానికి ఖర్చులు. మాటల మీద నియంత్రణ అవసరం. ముఖ్యులతో వాదనలకు దూరం మేలు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధన మేలు.

ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ  పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)

ప్రారంభంలో ఎదురు చూస్తున్న విషయాలలో ఆకస్మిక మార్పులు ఉన్నా, అనుకూలత. తక్కువ శ్రమతో పనుల సాధన. భాగస్వామి సహకారం. అనుకోని ఖర్చులు అయిన, వ్యాపార వ్యవహారాలు కొంతవరకు అనుకూలం. వారం మధ్యలో దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, సంతాన విషయాలలో, దూర ప్రయాణాల దృష్ట్యా అధిక ఆలోచనలు, నిద్రలేమి. ఆత్మీయుల ఆరోగ్య విషయంలో ఖర్చులు. స్థిరాస్తి అంశాలలో ముఖ్యంగా భూమి గృహ సంబంధంగా నిదానంగా నిర్ణయాలు అవసరం. ఆరోగ్య శ్రద్ధతో తో కోపాలు, ఉద్వేగాలు నియంత్రించుకోవాలి. వారాంతం ఆలోచనలలో మార్పులు. సంతాన విషయాలు మీద దృష్టి. శ్రమతో గౌరవాన్ని పెంచుకుంటారు. నరసింహస్వామి ఆరాధన మేలు.

మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2  పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)

వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలు మీద దృష్టి. భాగస్వామ సహకారం. స్నేహ సంబంధాల వృద్ధి. బంధు మిత్రుల కలయిక. సంతానవర్గం కొరకు, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఖర్చులు. అధికారం కలిగిన స్త్రీలతో వృత్తిలో పనుల సాధన కొరకు చేసే ప్రయత్నాలలో తగిన సమన్వయం, వినయం అవసరం. మధ్యలో ఆగిన పనులు తక్కువ శ్రమతో ముందుకు వెళతాయి, ఉన్నత వ్యక్తుల సహకారం. విందు వినోదాలలో పాల్గొంటారు. నెట్వర్క్ అనుకూలం. ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు, దేవాలయ సందర్శన. వారాంతం భూ వ్యవహారాలు, నిద్రలేమి, అధికశ్రమ, వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటారు. ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. గణపతి మందిరాలు దర్శించుట మేలు.

కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3  పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    

ప్రారంభంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి ,సంబంధ బంధువుల విషయాలు మీద దృష్టి. దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు, పెద్దల ఆశీస్సులు. తోబుట్టువులు మిత్రుల సహకారంతో ఆర్థిక విషయాల లో చర్చలు. వేగంగా ఆలోచనలు, వృత్తిలో ఆకస్మిక నిర్ణయాలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఆ విషయంలో ఆత్మీయుల సహకారం అవసరం. విందు వినోదాలకు అవకాశం. వారంమధ్యలో వృత్తిలో నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు, ఆర్థిక లాభాలకి  శ్రమ అధికం చేస్తారు. విజయాన్ని సాధించడానికి చేసే ప్రయత్నాలలో ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. వారాంతం ఆశించిన విషయాలనుకూలం, ప్రశాంతత లభ్యం. దుర్గాదేవి ఆరాధన మేలు.

మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)

వారం ప్రారంభంలో  ముఖ్యమైన పనులలో వాయిదాలు, ఆలస్యాలు ఇబ్బంది. వ్యక్తిగత ఆరోగ్యం, ఆత్మీయుల సహకారం అసంతృప్తి.  మానసిక ప్రశాంతత తక్కువ. ఉద్వేగ పూరి తమైన ఆలోచనలని, సంతాన వర్గంతో, తోబుట్టువులు, మిత్రులతో అభిప్రాయ బేధాలను అధిగమించాలి. కమ్యూనికేషన్ అనుకూలం  స్త్రీ సహకారం, వస్తు, వస్త్ర బహుమానలు లభ్యం. వారం మధ్యలో అధిక ఆధ్యాత్మిక ఆలోచనలు, వ్యక్తిగత అభివృద్ధికై మందిర దర్శనాలు ప్రశాంతతకై భగవతారాధన, పండితాశీస్సులు, ఆర్థికవృద్ధి, కుటుంబ సహకారం లభిస్తాయి. వారాంతం వృత్తిలో ఆలస్యం అవుతున్న అభివృద్ధి గౌరవం, మంచి అవకాశాలు, మాట విలువ పెరుగుతాయి. దేవి ఆరాధన మేలు.

 

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com