నవోదయనగర్ కాలనీలో ఘనంగా కమాన్, మహనీయుల విగ్రహాల ప్రారంభోత్సవం!
మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని నవోదయనగర్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కాలనీ కమాన్‌తో పాటు, భారతదేశ సామాజిక న్యాయం, సమానత్వం, దేశభక్తి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలైన మహనీయులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ప్రొఫెసర్ జయశంకర్ గార్ల విగ్రహాలను ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ఏర్పాటు ద్వారా వారి త్యాగాలు, సేవలు, ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, సమానత్వం, సామాజిక న్యాయం, దేశభక్తి విలువలను చాటిచెప్పేలా ఈ కార్యక్రమం నిలిచింది. కాలనీ అభివృద్ధికి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేసిన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులకు, కాలనీ పెద్దలకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కాలనీ వాసుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. మహనీయుల ఆశయాలే మనకు మార్గదర్శకం.. అభివృద్ధే మనందరి లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కార్యక్రమానికి తమ సాన్నిహిత్యాన్ని అందించారు.
అలాగే కాలనీ అధ్యక్షులు సింగపాక లింగం, కొయ్యడ జయపాల్, భూపతి అశోక్, కత్తుల రాజ్ కుమార్, గొట్టే పోచయ్య, వేల్పుల రాములు, వేల్పుల అనోక్, కుందేళ్ళ రాము మరియు బీఆర్ఎస్ నాయకులు వంజరి ప్రవీణ్ కరిపే, నవీన్ గౌడ్, తుడం నర్సింగ రావు, రామక్రిష్ణ, పూస రమేశ్, శేఖర్ గౌడ్, హరినాథ్ రెడ్డి, భూపాల్ గౌడ్, యాకూబ్, దామెర కుమార్, కుండ కుమార్, వసంతరావు, తాల్లపల్లి లింగం, కిరణ్, దండెం నరేందర్ మహిళా నాయకులు భాగ్యమ్మ, పర్వీన్, జ్యోతి, సంతోష, కొమురమ్మ, లక్ష్మీనర్సమ్మ, భాగ్య, తార తదితరులు పాల్గొన్నారు.