కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్
అనంతపురం బ్యూరో : కదిరి పట్టణంలోని 23వ వార్డుకు చెందిన టీడీపీ ముఖ్య నాయకుడు బిస్కెట్ బాబా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. యూత్ అధ్యక్షుడు ఎన్. బాబా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బిస్కెట్ బాబా మాట్లాడుతూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో పాటు బి.ఎస్. మక్బూల్‌పై ఉన్న అభిమానంతో స్వచ్ఛందంగా వైసీపీలో చేరినట్లు తెలిపారు. మక్బూల్ ఎమ్మెల్యేగా, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలనే లక్ష్యంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 23వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.