BREAKING
మైదుకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోటి రూపాయలు శ్రీదేవి కంటే ముందే ఆ అమ్మాయిని 10 ఏళ్లు ప్రేమించా: తొలి ప్రేమపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు! దసరా సందర్భంగా మున్సిపల్ కార్మికులకు వస్త్రాల పంపిణీ క్రీడల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కృషి మియాపూర్ సీఐ జయరాంను కలిసిన మాలకొండ రాయుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారణలో దర్శనమిచ్చిన నల్ల పోచమ్మ అమ్మవారు ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు బాలీవుడ్‌లో హింసాత్మక చిత్రాలదే రాజ్యమనేది ఒక భ్రమ మాత్రమే: నటుడు గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు! కదిరిలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు బిస్కెట్ బాబా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌.. టీడీపీ నిబద్ధత రాజమహేంద్రవరం చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి విమానాశ్రయంలో ఘన స్వాగతం.. కపిలేశ్వరపురంలో హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభం వచ్చే నెలలో కల్లూరు గూడెం పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరం వైసీపీ నాయకుడు గొల్ల బసవరాజుకు ఉమామహేశ్వర నాయుడు నివాళులు దహన సంస్కారాల ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సాయం సిజిపి నిరసనలపై మండిపడ్డ కంగనా రనౌత్: దేశాన్ని అస్థిరపరిచేందుకు దేశద్రోహ శక్తుల కుట్ర అంటూ ఆగ్రహం! దేవుని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం

ఉమ్మడి మెదక్ జిల్లాలో మైనింగ్ అక్రమాలపై విచారణ జరపాలి.

Select Suryaa Now
ఉమ్మడి మెదక్ జిల్లాలో మైనింగ్ అక్రమాలపై విచారణ జరపాలి.

 

అల్లాదుర్గ్ …అల్లాదుర్గం.. ఉమ్మడి మెదక్ జిల్లా లో విచ్చలవిడిగా  జరుగుతున్న మైనింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపాలని సింగూరు జలాల సాధన కమిటీ అధ్యక్షుడు బ్రహ్మం డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను విస్మరించి, ప్రకృతికి సవాల్ విసిరుతున్న అక్రమార్కులపై ఉల్లంఘన పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రకృతి ఖనిజ సంపద కాపాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సంగారెడ్డి, మెదక్, జిల్లాలోని వివిధ మండలాల్లో కొనసాగుతున్న క్రషర్లు, స్టోన్ క్రషర్లకు అనుమతులు ఉన్నాయా, గడువు ముగిసిందా, లేదా దానిపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.  ప్రతి యూనిట్కు లైసెన్సులు,  అధికారిక రికార్డులు క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనుమతికి మించి ఖనిజాలు తవ్వడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడమే కాకుండా పర్యావరణానికి ముప్పు వంటిల్లుతుందని, దట్టమైన దుమ్ము, శబ్దాలు, విపరీతంగా తిరుగుతున్న వాహనాలతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి చాలాసార్లు దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందని కానీ కొందరు అవినీతి అధికారుల వల్ల మైనింగ్ మాఫియా ఆగడాలు సాగుతున్నాయని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గతంలో జారీ చేసిన నోటీసులు, విధించిన జరిమానాలు, విచారణ జరిపి అక్రమ క్రషర్ మిషన్లపై ఉక్కు పాదం మోపాలని కోరారు.