సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి
ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేశారు. ఆదివారం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తన కార్యాలయంలో ఐదు మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. బైరాగిపట్టెడకు చెందిన కన్నయ్య నాయుడుకు 2 లక్షల 57 వేల రూపాయలు, ఎల్ బి నగర్ కు చెందిన సురేంద్ర బాబు కు 2 లక్షల 42 వేలు, రేణిగుంట రోడ్డు కు చెందిన సుబ్బరామయ్య కు లక్షా తొంభై రెండు వేల రూపాయలు, జీవకోనకు చెందిన మానస కు 2 లక్షల 49 వేలు, బైరాగిపట్టెడకు చెందిన శ్రీనివాస్ కు లెటర్ ఆఫ్ క్రెడిట్ కింద ఐదు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు రాజా రెడ్డి, శెట్టిపల్లి రామకృష్ణ, చరణ్, రాజేష్ ఆచ్చారి, లచ్చి రాయల్, టీడీపీ నాయకులు దేవెళ్ళ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్