గుంతకల్లులో మానవ హక్కుల వేదిక 10వ జిల్లా మహాసభ
అనంతపురం బ్యూరో : పట్టణంలో నిర్వహించిన మానవ హక్కుల వేదిక 10వ జిల్లా మహాసభలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ కార్యదర్శి బి. సురేష్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యలపై నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
ఈ మహాసభలో ఐఎఫ్‌టీయూ పట్టణ కార్యదర్శి రామదాసు, పీడీఎస్‌యూ నియోజకవర్గ కార్యదర్శి వి. వినోద్ పాల్గొన్నారు. పలువురు హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.