*సాయినాథుని 108వ పుణ్యతిథి ఉత్సవాలు ప్రారంభం* --22 వరకు సాయి సన్నిధిలో నిర్వహించనున్న శరన్నవరాత్రి వేడుకలు.. --ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు. చింతపల్లి మేజర్ న్యూస్.. నల్లగొండ జిల్లా.. _________________________ రెండవ శిరిడిగా పేరు ప్రఖ్యాతులు గ్రహించిన చింతపల్లి మండల కేంద్రంలో కొలువై
*సాయినాథుని 108వ పుణ్యతిథి ఉత్సవాలు ప్రారంభం*
--22 వరకు సాయి సన్నిధిలో నిర్వహించనున్న శరన్నవరాత్రి వేడుకలు..
--ఆలయంలో భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు.
చింతపల్లి మేజర్ న్యూస్.. నల్లగొండ జిల్లా..
_________________________
రెండవ శిరిడిగా పేరు ప్రఖ్యాతులు గ్రహించిన చింతపల్లి మండల కేంద్రంలో కొలువై ఉన్న సాయినాథుని 108వ పుణ్యతిథి వేడుకలను నేటి నుండి అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.ఆలయాన్ని సుందరంగా అలంకరించడంతో పాటు 22 వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు...
షిరిడీలో 12 సంవత్సరాల బాలుడిగా దర్శనమిచ్చిన సాయిబాబాను మహల్సపతి 'ఆవో సాయి' అని సంబోధించగా, అనంతరం సాయిబాబాగా భక్తులకు సంపూర్ణ దర్శనమిచ్చి, తన దివ్య లీలలతో శిరిడీ ప్రజల కష్టాలను తొలగించినట్లు భక్తుల విశ్వాసం. 1918 అక్టోబర్ 15న సాయిబాబా సమాధి పొందారు. ఈ విజయదశమితో స్వామివారి సమాధి పుణ్యతిథికి 108 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. మరోవైపు ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను కూడా భక్తిశ్రద్దలతో నిర్వహించేందుకు కార్యక్రమాలను రూపొందించింది. ఈనెల 11న శానకొండ శివ కిరణ్ శర్మ నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించనున్నారు. 12న జల్దా జయరాములు ఆధ్వర్యంలో గజేంద్రమోక్షం హరికథా కాలక్షేపం,13 న వావిలాల నాగమణి ఆధ్వర్యంలో శివలీలలు హరికథా కాలక్షేపం, 14, 19 తేదీలలో భజన సంకీర్తన కార్యక్రమాలనునిర్వహించనున్నారు. 15 న సినీనటి కరాటే కళ్యాణి శ్రీ వల్లీ కళ్యాణాన్ని హరికథారూపంలో ప్రదర్శించనున్నారు. 16 న కుమారి వెంకటి నాగ సింధు ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం హరికథా కాలక్షేపం,17 న బంగారు లక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ పార్వతీ కళ్యాణం హరికథా కాలక్షేపం, 18 న జిల్లా జయరాములు ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి కళ్యాణం హరికథా కాలక్షేపం నిర్వహించనున్నారు. 20 న విజయదశమి సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో పాలపిట్ట దర్శనం అనంతరం శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 21న పూర్ణాహుతి కార్యక్రమంతో పాటు సాయినాథుని ఏకనామ సంకీర్తన నిర్వహించనున్నారు. 22 న పద్మశ్రీ గరికపాటి నరసింహారావు స్వామివారి పుణ్యతిథి కార్యక్రమం సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రవచనం చేయనున్నారు. ప్రతిరోజు హరికథా కాలక్షేపాల కార్యక్రమాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించనున్నారు. సాయినాథుని పుణ్యతిథి వేడుకలు, శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కమిటీ చైర్మన్ మంచికంటి ధనంజయ తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయినాథుని ఆశీస్సులు పొందడంతో పాటు ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు వెంకటయ్య ,కృష్ణయ్య, పుల్లారెడ్డి, శ్రీనివాస్ ,వేద బ్రాహ్మణులు, భక్తులు తదితరులు ఉన్నారు.