BREAKING
శ్రీ సాయి కాలేజీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు -- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించిన విద్యార్థినులు దుబాయ్ తీరంలో ప్రమాదానికి గురైన భారత నౌక శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జార్ఖండ్‌లో మాజీ సైనికులు, వీర నారీలకు నిరంతరం అండగా నిలవాలి సీ సీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం భారత నౌకాదళంలోకి మరో సరికొత్త స్వదేశీ నౌక స్వదేశీ పరిశోధనల వాణిజ్యీకరణను వేగవంతం చేయాలి విత్తన రంగ భాగస్వామ్యం నుంచి ముప్పై రాష్ట్రాలు..2లక్షల కోట్ల నిధులు రాజకీయ కక్ష సాధింపు తోనే తప్పుడు కేసు-బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి రహత్‌నగర్‌లో సర్వే నంబర్‌ 80 భూమిపై గ్రామస్తుల స్పష్టీకరణ ఢిల్లీ ఐఎమ్‌సి 2026 వేదికగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం ఏపీ రాజకీయాలలో లెజెండరీ లీడర్ పెద్దిరెడ్డి స్విట్జర్లాండ్‌లో జాతీయ రోబోటిక్స్ ఛాలెంజ్‌లో సింగులారిటీ, ఫెర్రమ్ ఇంక్యుబేటర్స్ టీమ్‌లు రాజంపేటలో రైతుల ధర్నా.. గేట్ కాలేజీలో ఘనంగా ఫ్రెషర్స్ డే -నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం -సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేసిన విద్యార్ధులు కలలుకనీ విద్యతో వాటిని సహకారం చూసుకోండి: చైర్మన్ డా.తమ్మినేని వెంకటేశ్వర్లు పిలుపు

అనంతపురం నగర అభివృద్ధికి రూ.3.84 కోట్లతో పనులకు శ్రీకారం 30–40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

Select Suryaa Now
అనంతపురం నగర అభివృద్ధికి రూ.3.84 కోట్లతో పనులకు శ్రీకారం  30–40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

అనంతపురం బ్యూరో : నగర అభివృద్ధే లక్ష్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరోసారి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఒకే రోజు రూ.3.84 కోట్లతో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, పార్కుల అభివృద్ధి తదితర పనులకు భూమిపూజ నిర్వహించారు.

సంగమేశ్ నగర్, అశోక్ నగర్, గంగానగర్ పరిసరాల్లో రూ.1.32 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, అశోక్ నగర్, సంగమేశ్ నగర్ ప్రాంతాల్లో రూ.49.48 లక్షలతో సీసీ డ్రైన్లు, కల్వర్టుల పనులు ప్రారంభించారు. అశోక్ నగర్‌లో రూ.20 లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి, అరుణోదయ కాలనీ ధోబీఘాట్‌లో రూ.18.70 లక్షలతో వాటర్ టబ్‌ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాజీవ్ చిల్డ్రన్ పార్క్ అభివృద్ధికి రూ.27 లక్షలు, శారదా నగర్‌లో స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి రూ.42 లక్షలు కేటాయించి పనులు ప్రారంభించారు.

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ కాలనీలో రూ.1.13 కోట్లతో ఆరు పనులకు, రాజీవ్ కాలనీ, రామయ్య కాలనీల్లో రూ.67 లక్షలతో ఏడు పనులకు భూమిపూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, నగరంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. గత రెండేళ్లలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పరిష్కారం చూపిస్తున్నామని అన్నారు.

అరుణోదయ కాలనీలో సుమారు 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో మంజూరైన ధోబీఘాట్‌కు మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహకారంతో అనంతపురం నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

నగరంలోని డంపింగ్ యార్డు సమస్యపై స్పందిస్తూ, చెత్త పేరుకుపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారిందని, మరో రెండు నెలల్లో అక్కడ పూర్తిస్థాయిలో చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో అక్కడ డంపింగ్ యార్డు కనిపించకుండా చర్యలు చేపడతామని, ఇందుకోసం రూ.17 కోట్లతో ఫ్రెష్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ తీసుకురానున్నట్లు వెల్లడించారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.