BREAKING
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్ అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్

కడపలోని విజయదుర్గ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
కడపలోని విజయదుర్గ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం

శైలపుత్రి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ విజయదుర్గాదేవి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కడప శ్రీ విజయదుర్గాదేవి ప్రధమ స్వరూపమైన "శైలపుత్రి" గ మొదటి రోజున దర్శనమిచ్చారు. పర్వత రాజైన హిమవంతుని పుత్రికగ జన్మించడంతో ఆ తల్లికి శైలపుత్రి దేవిగా పూజలు,ఉపాసనాలు జరపబడుతాయి. ఆలయంలో మొదటిరోజున శ్రీ విజయదుర్గాదేవికి తెల్లవారుజామున పుణ్యనది జలాలతో నిండిన 9 విశేష కళాశాలతో నవకలశస్నపనం (విశేష అభిషేకం) వైభవంగా నిర్వహించారు. సుస్వర వేదమంత్రాలు, మంగలవాయిద్యాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, అనంతరం చండీహోమ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీచక్రమండపంలో శ్రీచక్రార్చనలు, అలాగే శ్రీ విజయదుర్గాదేవికి మహానివేదన, మంగళహారతులు నిర్వహించారు. సాయంత్రం 6 గలకు ఆలయంలో మొదటిరోజు పూజ కార్యక్రమంలో భాగంగా "అష్టదళపద్మారాధన" కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు శ్రీ దుర్గాప్రసాద్ గారు కుటుంబసమేతంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారు శైలపుత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 గలకు శ్రీ విజయదుర్గ మల్లికార్జునులను సింహ వాహనంపై ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు.

 కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.