BREAKING
స్టార్‌డమ్ తెచ్చిపెట్టే ఒంటరితనం భయంకరమైనది: అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు! ‘నిరసనకారులపై ఘటనలను తేలికగా తీసుకోం’.. సుప్రీ ధర్మాసనం వ్యాఖ్య సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కడపలోని విజయదుర్గ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం దసరా ఉత్సవాలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించడంపై హర్షం.. ఆదివాసి రాష్ట్ర నాయకులు ఈసం నరసింహారావు చిరంజీవిని కలిసిన ఎమ్మెల్యేలు బండారు బత్తుల ఏఐ ఒప్పందంపై హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్ సంచలన నిర్ణయం: అమెజాన్‌తో ఇక పనిచేయనని స్పష్టం! సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి చీరాలలో 1116 కలిశాలతో జగన్మాత నగరోత్సవం హాలీవుడ్ హర్రర్ చిత్రం 'అదర్ మమ్మీ' రివ్యూ: భయపెట్టడంలో జెస్సికా చాస్టైన్ సినిమా విఫలమైందా! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూనెం బాపనయ్య మృతి పట్ల ఘన నివాళి. కలరిపయట్టుపై విదేశీ నటుల అవగాహన అద్భుతం: హాలీవుడ్ సహనటులపై విద్యుత్ జామ్‌వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు! వైసీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

ట్రాక్టర్ డోజర్ స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు…అడ్డుకున్న గిరిజనులు...

Select Suryaa Now
ట్రాక్టర్ డోజర్ స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు…అడ్డుకున్న గిరిజనులు...


--- పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం.
---పల్లె బోగడ తండాలో లోఉద్రిక్తత.
--  ట్రాక్టర్ డోజర్ ను వదిలి వెనుదిరిగిన అధికారులు.

సూర్య, నాగిరెడ్డిపేట:అటవీ భూమిని చదును చేశారనే ఆరోపణల నేపథ్యంలో అటవీ భూమిని చదును చేసిన ట్రాక్టర్ డోజర్ ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను గిరిజనులు అడ్డుకోవడంతో నాగిరెడ్డిపేట మండలం పల్లెబోగడ తండాలో  శుక్రవారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాక్టర్ డోజర్ ను  తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా తండావాసులు డోజర్ ముందు  బైఠాయించారు. దీంతో అటవీశాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ట్రాక్టర్ డోజర్ కు సంబంధించిన కుటుంబీకురాలు ధనావత్ సంత్యాలి  పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం.. బొల్లారం రేంజ్ పరిధిలోని పల్లె బోగడ తండా శివారులో కొందరు వ్యక్తులు ఇటీవల సుమారు 14 ఎకరాల అటవీ భూమిని  చదును చేశారు. దీంతో విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్లారెడ్డి అటవీశాఖ రేంజ్ అధికారి రమేష్ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు, పోలీసుల సహాయంతో పల్లెబోగడ తండాకు చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు గుర్తించిన ట్రాక్టర్ డోజర్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయగా, ట్రాక్టర్ డోజర్ యజమానులు తాము తమ ట్రాక్టర్ డోజర్ తో అటవీ భూమిని చదును చేయలేదంటూ ట్రాక్టర్ డోజర్ కుటుంబీకులు తండా వాసులతో కలిసి‌ ట్రాక్టర్ డోజర్ ముందు బైఠాయించి దానిని తరలించకుండా అడ్డుకున్నారు.


గతంలో ఇతర ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తే, ఇప్పుడు తమ ట్రాక్టర్ డోజర్ ఎలా తీసుకెళ్తారని వారు అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ట్రాక్టర్ డోజర్ కు సంబంధించిన కుటుంబీకురాలు ధనావత్ సంత్యాలి మనస్తాపానికి గురై పురుగుల మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను తండావాసులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో  ట్రాక్టర్ డోజర్ ను స్వాధీనం చేసుకోకుండా అటవీశాఖ అధికారులు వెనుదిరిగారు.