BREAKING
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు- సర్పంచ్ కావటి సుధాకర్ అందరిలాగే నేనూ ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: నారా లోకేశ్ చేసిన ట్వీట్ వైరల్! చక్రయాత్ర - నవదుర్గ దర్శనం-1 మూలాధారంలో మేల్కొన్న మొదటి శక్తి - శైలపుత్రి ఆరాధన (ప్రకృతి స్వరూపిణి - స్థిరత్వ, ధైర్యాల ప్రదాయిని) ఫిర్యాదు పరిష్కారం అయితే సరిపోదు ప్రజలు సంతృప్తి పొందాలి పుతిన్‌తో ట్రంప్ చమురు ఒప్పందం.. సంచలన నివేదిక వెల్లడి! రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలు.. వికసిత్ భారత్ సాధనలో యువతే కీలకం...కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపు కబడ్డీ ఆడిన కాంగ్రెస్ మండల నాయకులు 2027 ఆగస్టులో అవనిగడ్డలో ఉషశ్రీ శతజయంతి చీరాలలో క్షుద్ర పూజల కలకలం..! నేపాల్‌లో బుధి గండకి నది ఉగ్రరూపం: భారత్‌లో అత్యంత చౌకగా స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు రాశి ఫలాలు (వార ఫలాలు) 11 Oct 2026 -17 Oct 2026 యూఎస్ గ్రీన్ కార్డ్ నిబంధనల కఠినతరం: భారత టెక్ రంగానికి గొప్ప అవకాశమన్న మంత్రి ప్రియాంక్ ఖర్గే! చింతచెట్టు నీడన.. గిరిపుత్రుల చింతలు తీర్చిన పవన్

దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

Select Suryaa Now
దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
  • మంత్రి నారా లోకేష్

దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న కూటమి ప్రభుత్వం

సూర్య స్టేట్ బ్యూరో అమరావతి :  కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో అలరారుతోందని పేర్కొన్నారు. భక్తులను ఎల్లవేళలా కాపాడే బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లోకేష్ పేర్కొన్నారు. దుర్గమ్మ కరుణాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.